Investment Plan: నెలకు రూ. 10 వేల పెట్టుబడితో కోటీశ్వరులు కావచ్చు.! ప్రారంభించండిలా..
పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవాలన్నా, అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నా వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఇందు కోసం మీరు సంపాదిస్తున్న ఆదాయంలో కనీసం 20 శాతం నుంచి 30 శాతం వరకూ పెట్టుబడులకు మళ్లించాలి.
పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవాలన్నా, అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నా వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఇందు కోసం మీరు సంపాదిస్తున్న ఆదాయంలో కనీసం 20 శాతం నుంచి 30 శాతం వరకూ పెట్టుబడులకు మళ్లించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుంది. భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుంది.
మనలో చాలా మందికి నెలవారీ జీతం తక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి వారు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సాధ్యం కాదు. నెలకు కనీసం రూ.10 వేలతో పెట్టుబడులను ప్రారంభించవచ్చు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లను కనీసం మూడింటిని ఎంచుకోండి. ఒక దానిలో కనీసం రూ.2వేలు పెట్టుబడి పెట్టండి. మరో ఫండ్‌లో రూ.1,000, ఇంకో ఫండ్‌లో రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయండి. ఓ రూ.2,000లను జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)లో జమ చేయండి. దీని వల్ల పదవీ విరమణ తరువాత మీకు మంచి కార్పస్ (నిధి) ఏర్పడుతుంది.అత్యవసర నిధి కోసం బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయండి. దీనిలో కనీసం నెలకు రూ.2,000 చొప్పున పొదుపు చేయండి. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేందుకు బీమా పాలసీలు తీసుకోవాలి. ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం నెలకు రూ.1,000 కేటాయించండి.
ఇది చదవండి: షేర్ హోల్డర్లకు అంబానీ అద్దిరిపోయే న్యూస్.. 100 షేర్లకు మరో 100 ఫ్రీ
మిగిలిన రూ.1,000తో మంచి పనితీరు చూపిస్తున్న షేర్లను కొనడం మంచిది. అయితే దీనిలో కొంత రిస్క్ కచ్చితంగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలం కొనసాగించాలి. అనుకోకుండా వెనక్కి తీసుకున్నా, వీలైనంత తొందరగా దాన్ని భర్తీ చేయాలి. ఏటా కనీసం 10 శాతం చొప్పున పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్తే, మంచి సంపదను సృష్టించుకోవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత నిపుణుల సలహాలను తీసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి