AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Cards: నెలవారీ ఆదాయం లేకపోయినా.. క్రెడిట్ కార్డు పొందొచ్చు! ఎలాగంటే..

సాధారణంగా నెలవారీ ఆదాయం లేదా వ్యాపారం వంటివి ఉన్నవాళ్లకే బ్యాంకులు కాల్ చేసి క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుంటాయి. నెలవారీ ఆదాయం లేనివాళ్లు క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంటుంది. అయితే ఇలాంటి వాళ్లు కూడా క్రెడిట్ కార్డు పొందేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Cards: నెలవారీ ఆదాయం లేకపోయినా.. క్రెడిట్ కార్డు పొందొచ్చు! ఎలాగంటే..
Credit Cards Without Job
Nikhil
|

Updated on: Oct 02, 2025 | 5:56 PM

Share

బ్యాంకులు క్రెడిట్ కార్డు ఇచ్చేముందు వారికేదైనా ఆదాయం ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటాయి. ఏదైనా  ఆదాయం ఉండి, క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా ఉంటే వారికి వెంటనే క్రెడిట్ కార్డు లభిస్తుంది. ఒకవేళ ఎలాంటి ఆదాయం లేకపొతే అలాంటివాళ్ల అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంటుంది. అయితే క్రెడిట్ కార్డు పొందేందుకు కొన్ని వేరే మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్

బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఉన్నవాళ్లు ఈజీగా క్రెడిట్ కార్డు పొందొచ్చు. వాళ్ల ఫిక్స్ డ్ డిపాజిట్ మొత్తాన్ని సెక్యూరిటీగా పెట్టి ఆ డిపాజిట్ మొత్తంలో 90 శాతం వరకూ క్రెడిట్ కార్డు లిమిట్ గా పొందొచ్చు.

బ్యాంక్ బ్యాలెన్స్ ను బట్టి..

నెలవారీ ఆదాయం లేకపోయినా.. మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉంటూ.. డబ్బు వేస్తూ తీస్తూ ఉంటే.. లేదా రోజువారీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటే .. బ్యాంకులు మీకు క్రెడిట్ కార్డు ఇస్తాయి. అయితే బ్యాంకు బ్యాలెన్స్ జీరో కాకుండా ఎప్పుడూ పెద్ద మొత్తంలో మెయింటెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు మాత్రమే కార్డు ఇష్యూ అయ్యే అవకాశం ఉంది.

ఫ్యామిలీ యాడ్ ఆన్

మీ ఫ్యామిలీ మెంబర్ క్రెడిట్ కార్డుకి యాడ్ యాన్ రూపంలో మీరు క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. ఇది మీ పేరు, అడ్రెస్ తో వస్తుంది. దీనికి ష్యూరిటీ మీ ఫ్యామిలీ మెంబర్ అన్నమాట.  అలాగే ఇకపోతే తక్కువ క్రెడిట్ లిమిట్ తో స్టూడెంట్స్ కు కూడా క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి కొన్ని బ్యాంకులు.

నమ్మకాన్ని బట్టి..

మీకు నెలవారీ ఆదాయం లేకపోయినా గతంలో లోన్స్ తీసుకుని తిరిగి చెల్లించిన రికార్డు ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాంకులు మీకు క్రెడిట్ కార్డు ఇష్యూ చేయొచ్చు. క్రెడిట్ కార్డుల విషయంలో నిర్ణయం అనేది పూర్తిగా బ్యాంకు అధికారుల చేతుల్లోనే ఉంటుంది.  మీకు ఎలాంటి ఉద్యోగం లేకపోయినా మీకంటూ కొంత ఆస్తి ఉంటే సదరు బ్యాంక్ మేనేజర్ మీపై ఉన్న నమ్మకంతో మీకు క్రెడిట్ కార్డు జారీ చేయొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..