AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duplicate RC: డూప్లికేట్ ఆర్‌సి కావాలా.. ఈ సింపుల్ స్టెప్స్‌తో ఇంటి దగ్గరికే రప్పించుకోవచ్చు.. ఎలా అంటే..

వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సి) అనేది ఒక వాహనం చట్టబద్ధతను నిరూపించే ముఖ్యమైన డాక్యుమెంట్. దీన్ని రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో) జారీ చేస్తుంది. ఈ ఆర్సీలో వాహనం నంబర్, యజమాని వివరాలు, వాహనం రకం, తయారీ సంవత్సరం వంటి సమాచారం ఉంటుంది. మీ వెహికిల్ ఆర్సీ కోల్పోయినా లేదా దెబ్బతిన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడం ఇప్పుడు సులభమైన ప్రక్రియగా మారింది. ఈ ఆర్టికల్‌లో, డూప్లికేట్ ఆర్సీ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన స్టెప్స్, డాక్యుమెంట్లు జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం.

Duplicate RC: డూప్లికేట్ ఆర్‌సి కావాలా.. ఈ సింపుల్ స్టెప్స్‌తో ఇంటి దగ్గరికే రప్పించుకోవచ్చు.. ఎలా అంటే..
Vehicle Rc Duplicate Application Process
Bhavani
|

Updated on: Apr 09, 2025 | 5:14 PM

Share

రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ప్రతి వాహన యజమానికి తప్పనిసరి డాక్యుమెంట్. ఇది వాహనం చట్టబద్ధతను నిరూపిస్తుంది. ఆర్సీ కోల్పోతే, దొంగిలించబడితే లేదా దెబ్బతిన్నట్లయితే, డూప్లికేట్ ఆర్సీ కోసం దరఖాస్తు చేయడం ద్వారా మీరు మీ వాహనాన్ని చట్టపరమైన ఇబ్బందుల నుంచి సేఫ్ గా ఉంచుకోవచ్చు. డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడం గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తేలికగా మారింది. సరైన డాక్యుమెంట్లతో ఆర్టీవోని సంప్రదిస్తే లేదా ఆన్‌లైన్ సేవలను వినియోగిస్తే, మీరు త్వరగా మీ ఆర్సీని పొందవచ్చు. మీ వాహనానికి చట్టబద్ధత ఉండాలంటే దీన్ని ఎప్పుడూ వెంట ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. డూప్లికేట్ ఆర్సీ పొందడానికి అవసరమైన 3 పద్ధతులు ఇవి..

డూప్లికేట్ ఆర్సీ కోసం ఇలా దరఖాస్తు చేయండి..

1. ఎఫ్‌ఐ‌ఆర్ ఫైల్ చేయండి (అవసరమైతే):

మీ ఆర్సీ కోల్పోయినట్లయితే, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ఫైల్ చేయండి. ఈ ఎఫ్ఐఆర్ డూప్లికేట్ ఆర్సీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు సమర్పించాల్సి ఉంటుంది.

అవసరమైన డాక్యుమెంట్లు ఇవి:

ఎఫ్ఐఆర్ కాపీ (ఆర్సీ కోల్పోయిన సందర్భంలో) దరఖాస్తు ఫారం 26 (రెండు కాపీలు) వాహన యజమాని గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ) అడ్రస్ ఫ్రూఫ్ వెహికిల్ ఇన్సూరెన్స్ కాపీ పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో సంబంధిత వివరాలు

2. ఆర్టీవోని సంప్రదించండి:

మీ సమీప రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో)కి వెళ్లి, ఫారం 26ని సమర్పించండి. అన్ని డాక్యుమెంట్లను సరిచూసుకుని, నిర్ణీత రుసుము చెల్లించండి. రుసుము రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.

3.ఆన్‌లైన్ దరఖాస్తు (వాహన్ పోర్టల్):

ఇప్పుడు చాలా ఆర్టీవోలు ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నాయి. మీరు వాహన్ పోర్టల్ (parivahan.gov.in) ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అక్కడ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించే సౌలభ్యం ఉంది.

వెరిఫికేషన్, డెలివరీ:

దరఖాస్తు సమర్పించిన తర్వాత, ఆర్టీవో అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత డూప్లికేట్ ఆర్సీ మీ చిరునామాకు పోస్ట్ ద్వారా పంపుతారు.

గమనించవలసిన విషయాలు

దరఖాస్తు చేసే ముందు మీ వాహనంపై ఎలాంటి లోన్ లేదా చట్టపరమైన సమస్యలు లేవని నిర్ధారించుకోండి. అన్ని డాక్యుమెంట్లు సరైనవని చెల్లుబాటు అయ్యే తేదీలతో ఉన్నాయని చూసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తు చేస్తే, అప్‌లోడ్ చేసిన ఫైళ్లు స్పష్టంగా ఉండేలా జాగ్రత్త వహించండి.