లోను కట్టలేదని రంగంలోకి బ్యాంక్ మేనేజర్.. వచ్చి ఏకంగా దాన్నే ఎత్తుకుపోయారు
బ్యాంకులు తమ ఖాతాదారులకు రకరకాల లోన్లు ఇస్తుంటారు. తిరిగి వాటిని తమ ఏజెంట్లద్వారా వసూలు చేయిస్తుంటారు. అయితే ఓ కస్టమర్ లోను తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో డైరెక్టుగా బ్యాంక్ మేనేజరే రంగంలోకి దిగాడు. లోను వసూలు చేసుకోడానికి కస్టమర్ ఇంటికి వెళ్లిన బ్యాంక్ మేనేజర్ అక్కడ చేసిన పనికి అంతా మండిపడుతున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గోరిలపాడు తండాకు చెందిన బానోత్ లింగా అనే యువకుడు కూసుమంచి లోని డీసీసీబి బ్యాంకులో ముద్రా లోన్ తీసుకున్నాడు. వాటితో మైక్రో ఫైనాన్స్ ద్వారా వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ఇప్పిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో అతని ఇంట్లోని కుటుంబ సభ్యులకు అనారోగ్యం చేయడంతో డబ్బులు సర్దుబాటుకాక 6 నెలలుగా బ్యాంకు లోను ఈఎంఐ చెల్లించడంలేదు. దీంతో బ్యాంక్ మేనేజర్ సిబ్బందిని వెంటపెట్టుకొని లింగా ఇంటికి వెళ్లి లోను కట్టమని అడిగాడు. లింగా తన పరిస్థితి వివరించి గడువు కోరాడు. అందుకు ససేమిరా అన్న బ్యాంకు మేనేజర్ అప్పుకింద లింగా పెంచుకుంటున్న గొర్రెలను తీసుకెల్లిపోయాడు. దీంతో బాధితుడు మరోచోట అప్పు చేసి 10వేల రూపాయిలు కట్టడంతో గొర్రెలను బాధితుడు ఇంటికి తరలించారు. డీసీసీబీ మేనేజర్ నిర్వాకం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
dilsukhnagar bomb blast: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

