Mutual funds: రిటైర్‌మెంట్ నాటికి కోటి రూపాయలు జమ చేయాలంటే ప్లానింగ్ ఇలా ఉండాలి!
వయసులో ఉన్నప్పుడు ఎంతైనా కష్టపడి సంపాదించొచ్చు. కానీ, రిటైర్ మెంట్ వయసు వచ్చాక ఆదాయం కోసం కష్టపడడం కుదరకపోవచ్చు. అందుకే దానికోసం ముందునుంచే ప్లానింగ్ చేసుకోవాలి. రిటైర్ మెంట్ నాటికి కనీసం కోటి రూపాయలు చేతిలో ఉంటే మిగతా జీవితాన్ని హాయిగా గడిపేయొచ్చు. మరి కోటి రూపాయల కోసం ఏలా ప్లాన్ చేసుకోవాలి?

రిటైర్ మెంట్ తర్వాత జీవితం సాఫీగా సాగాలంటే దానికై ముందు నుంచే ప్రణళిక వేసుకోవాలి. ఆ వయసులో ఉండే అవసరాల దృష్ట్యా సరిపడా ఆదాయాన్ని సమకూర్చుకునేలా ప్లా్న్ చేసుకోవాలి. రిటైర్ మెంట్ తర్వాత ఉండే అవసరాల కోసం రిటైర్ మెంట్ ఫండ్ ను రెడీ చేసుకోవాలి. అయితే నిపుణుల ప్రకారం ఈ ఫండ్ రూ. కోటి ఉంటే బాగుంటుంది. కోటి రూపాయలు అంటే ఇప్పుడు ఎక్కువగా కనిపించొచ్చు. కానీ, ముప్ఫై ఏళ్ల తర్వాత అది కాస్త తక్కువ మొత్తంగా అనిపించొచ్చు. అందుకే రిటైర్ మెంట్ నాటికి కనీసం కోటి రూపాయల ఫండ్ సమకూర్చుకుంటే మిగిలిన జీవితాన్ని హాయిగా జీవించొచ్చు అంటున్నారు నిపుణులు. ఈ కోటి రూపాయల కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే..
రూ. కోటి సరిపోతుందా?
కాలంతోపాటే డబ్బు విలువ తగ్గిపోతుంటుంది. దీన్నే ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఈ రోజు వంద రూపాయలకు వచ్చిన వస్తువు పదేళ్ల తర్వాత అదే రేటుకి రాదు. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని పొదుపు చేసుకోవాలి. ద్రవ్యోల్బణం అనేది ఏడాదికి 2 నుంచి 3 శాతం పెరుగుతుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పొదుపు చేయాలి. అందుకే రిటైర్ మెంట్ ఫండ్ విషయంలో ఫిక్స్ డ్ డిపాజిట్లతోపాటు ఈక్విటీ మార్కెట్ ను కూడా ఎంచుకోవాలి. నెలకు రూ.15 వేలు చొప్పున 20ఏళ్ల పాటు సిప్(SIP) చేస్తే.. సంవత్పరానికి 12 శాతం సగటు రిటర్న్స్ తో.. 20 ఏళ్లకు రూ.1 కోటి నిధిని సమకూర్చుకోవచ్చు.
విత్ డ్రా ఇలా..
మరొక విషయం ఏంటంటే.. రూ. కోటి నిధిని సమకూర్చుకున్నాక దాన్ని ఎలా విత్ డ్రా చేసుకోవాలి అన్నది కూడా తెలిసి ఉండాలి. లేకపోతే కోటి రూపాయలకు కూడా కొన్నేళ్లలోనే ఖర్చయ్యే అవకాశం ఉంది. ముందుగా కోటి రూపాయలను 40 శాతం ఈక్విటీ మార్కెట్స్ లో 60 శాతం ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టాలి. ఇప్పుడు వీటిలో నుంచి ప్రతి ఏడాది 3 శాతం ఈక్విటీ నుంచి 8 శాతం ఫిక్స్ డ్ డిపాజిట్ల నుంచి విత్ డ్రా చేసుకోవాలి. ఇలా చేస్తూ పోతే మీ రూ.కోటి ఖర్చవ్వకుండా ఇంకా పెరుగుతూ పోతాయి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ నుంచి తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి. ఇలా ప్లాన్ చేసుకుంటే రిటైర్ మెంట్ లైఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ లేకుండా సాగిపోతుంది.
పెన్షన్ స్కీమ్
ఇకపోతే నేషనల్ పెన్షన్ స్కీం(ఎన్‌పీఎస్) ద్వారా కూడా మీరు రిటైర్ మెంట్ లైఫ్ ను ప్లాన్ చేసుకోవచ్చు. 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గలవాళ్లు ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు. ఇందులో మీరు చేసే డిపాజిట్ ను బట్టి పెన్షన్ మారుతుంటుంది. అయితే ఇందులో రిటర్న్స్ తక్కువ కాబట్టి కాస్త ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసినదాన్ని బట్టి నెలవారీ ఆదాయం లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




