AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: అమ్మబాబోయ్.. రికార్డులే రికార్డులు.. రూ.లక్షా 23 వేల మార్క్ దాటిన బంగారం ధర..

బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధర దూసుకెళ్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం చేరుతోంది. తులం బంగారం లక్షన్నర వైపు పరుగులు తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది..

Gold Rate Today: అమ్మబాబోయ్.. రికార్డులే రికార్డులు.. రూ.లక్షా 23 వేల మార్క్ దాటిన బంగారం ధర..
Gold Rates
Shaik Madar Saheb
|

Updated on: Oct 08, 2025 | 11:09 AM

Share

బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారం ధర దూసుకెళ్తోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం చేరుతోంది. తులం బంగారం లక్షన్నర వైపు పరుగులు తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.. అదే విధంగా వెండి ధరలు సైతం లక్ష 70 మార్క్ కు చేరుకున్నాయి.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి.. మంగళవారం పదిగ్రాముల బంగారంపై రూ.1250 వరకు ధర పెరగగా.. బుధవారం కూడా బంగారం అదే జోరుతో ట్రేడయింది. తాజాగా.. బంగారం 10 గ్రాములపై రూ.1,150 పెరిగా.. లక్షా 23వేల 170కి చేరుకుని.. సరికొత్త రికార్డును తిరగరాసింది.

బుధవారం ఉదయం దేశీయంగా నమోదైన ధరల ప్రకారం..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,150 మేర ధర పెరిగి.. రూ.1,23,170 కి చేరుకుంది

22 క్యారెట్ల గోల్డ్ పై రూ.1,050 మేర ధర పెరిగి.. రూ.1,12,900లకి చేరుకుంది.

18 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.860 మేర ధర పెరిగి.. రూ.92,380కి చేరుకుంది.

కాగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి కిలో ధర రూ.1,57000 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 23 వేల 170రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,12,900 లుగా ఉంది. కిలో వెండి ధర లక్షా 67 వేల రూపాయలుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర.. రూ.1,23,170 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.రూ.1,12,900 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,67000 లుగా ఉంది.

కాగా.. బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి..

పసిడి పరుగులకు అంతర్జాతీయంగా పలు పరిణామాలు ఊతమిస్తున్నాయని.. ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. US ఫెడ్‌ ఈ నెలలో మళ్లీ వడ్డీరేట్లు తగ్గించవచ్చనే అంచనాలు.. ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌.. జపాన్‌లో బాండ్‌ ఈల్డ్స్‌తో బంగారం ధరలు పెరుగుతున్నాయి..

ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
ఇంట్లోనే వంట గ్యాస్‌ తయారీ..బయో గ్యాస్‌ తయారీ గురించి మీకు తెలుసా
జిమ్ మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
జిమ్ మొదలుపెట్టి మధ్యలో మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం