AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Purity: వెండిలో కూడా కల్తీ ఉంటుందని తెలుసా? ఇలా ఈజీగా గుర్తించొచ్చు!

పెరుగుతున్న బంగారం, వెండి ధరల కారణంగా చాలామంది వాటిని కొనుగోలు చేయడం లాభదాయకం అని భావిస్తున్నారు. అందుకే పండుగల సీజన్ లో బంగారం వెండి కొనుగోలు చేస్తున్నారు. అయితే బంగారం తరహాలోనే వెండిలో కూడా కల్తీ జరుగుతుందని చాలామందికి తెలియదు. వెండి కొనేముందు దాని స్వచ్ఛతను గుర్తించకపోతే నష్టపోయే ప్రమాదమంది. వెండి స్వచ్ఛతను ఎలా గుర్తించొచ్చంటే..

Silver Purity: వెండిలో కూడా కల్తీ ఉంటుందని తెలుసా? ఇలా ఈజీగా గుర్తించొచ్చు!
Silver Purity
Nikhil
|

Updated on: Oct 22, 2025 | 2:33 PM

Share

గత కొన్ని వారాల నుంచి మార్కెట్లో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. దీంతో బంగారం, వెండిలో కల్తీ జరుగుతున్న కేసులు కూడా కొన్ని చోట్ల బయటకొస్తున్నాయి. అందుకే ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో ప్రజల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వెండిలో జరిగే కల్తీ గుర్తించలేని విధంగా ఉంటుంది. అసలు వెండిలో ఎలా కల్తీ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కల్తీ ఇలా జరుగుతుంది

సాధారణంగా మార్కెట్లో లభించే వెండిలో కొంత రాగి కలుస్తుంది. అప్పుడే అది దృఢంగా ఉండగలదు. అయితే రాగికి బదలుగా మరికొన్ని మిశ్రమాలను కలుపి వెండిని కల్తీ చేస్తున్నారు కొందరు వ్యాపారులు.  వెండిలో రాగి సరైన నిష్పత్తిలో ఉంటేనే అది హాల్‌మార్కింగ్‌కు అర్హత సాధిస్తుంది. ఆ నిష్పత్తి అటు ఇటు అయితే అది కల్తీ వెండి కింద లెక్క. అసలైన వెండినలో 92.5 గ్రాముల స్వచ్ఛమైన వెండి ఉంటుంది. మిగిలిన భాగం రాగి వంటి ఇతర లోహాల మిశ్రమం కలుపుతారు. ఇవి ఆభరణాలను గట్టిగా, మన్నికగా ఉండేందుకు తోడ్పడతాయి. అయితే లోకల్ మార్కెట్లో చాలామంది జ్యువెలర్లు ఇతర లోహాల మిశ్రమాన్ని ఎక్కువ కలిపి కల్తీ చేస్తున్నారు. కల్తీ వెండి త్వరగా పాడైపోతుంది. రంగు కూడా త్వరగా పోతుంది. అందుకే వెండి కొనే ముందు స్వచ్ఛతను గుర్తించాలి.

నకిలీ వెండిని ఇలా గుర్తించొచ్చు

  • వెండి కొనేముందు హాల్‌మార్క్ పరిశీలించడం చాలా ముఖ్యం. అసలైన వెండిపై 925 లేదా BIS హాల్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది.
  • వెండిని ఐస్ క్యూబ్ తో టెస్ట్ చేయొచ్చు. అసలైన వెండిపై మంచు ముక్క పెడితే త్వరగా కరుగుతుంది.
  • వెండిని అయస్కాంతంతో కూడా పరీక్షించొచ్చు.  నకిలీ వెండి అయితే అయస్కాంతానికి ఈజీగా అతుక్కుంటుంది. అసలైన వెండి అయస్కాంతానికి అంటుకోదు.
  • బంగారంలాగే ఇప్పుడు వెండి ఆభరణాలపై కూడా 6 అంకెల HUID కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ను బట్టి స్వచ్ఛతను గుర్తించొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ