Gold Investment: పసిడిపై పెట్టుబడి పెడితే భవిష్యత్తు బంగారమేనా..? గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ నిబంధనలు ఇవే..
బంగారం ధరలు కాల క్రమేణా పెరుగుతున్నాయి. పండుగల సీజన్‌లో బంగారం ఆభరణాలు, డిజిటల్‌గోల్డ్, గోల్డ్ బాండ్స్ ఇలా ఏ రూపంలో అయినా బంగారం కొనడాన్ని శుభప్రదంగా భారతీయులు భావిస్తారు. బంగారం పై భారతీయులకున్న..
బంగారం ధరలు కాల క్రమేణా పెరుగుతున్నాయి. పండుగల సీజన్‌లో బంగారం ఆభరణాలు, డిజిటల్‌గోల్డ్, గోల్డ్ బాండ్స్ ఇలా ఏ రూపంలో అయినా బంగారం కొనడాన్ని శుభప్రదంగా భారతీయులు భావిస్తారు. బంగారం పై భారతీయులకున్న మక్కువ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే, వివిధ రూపాలలో బంగారం కొనడానికి, మన దగ్గర నిల్వ ఉంచడానికి ఉన్న నిబంధనలు, పరిమితుల పై చాలా మందికి తెలియకపోవచ్చు. బంగారంపై ఏయే రూపాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి. గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ కు సంబంధించిన నిబంధనలు, పరిమితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, స్టాక్స్‌కు బదులు బంగారంలో పెటట్టుబడులు పెట్టడానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. ఫిజికల్ గోల్డ్ అయితే ఒక వివాహిత మహిళ 500 గ్రాముల బంగారాన్ని ఆభరణాల రూపంలో లేదా ఆర్నమెంట్ గోల్డ్ కలిగి ఉండవచ్చని, అవివాహితులకు ఈ పరిమితి 250 గ్రాములు, పురుషులకు వివాహితులైనా, అవివాహితులైనా 100 గ్రాముల వరకు ఉండవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తాజా సర్క్యులర్‌లో తెలిపినట్టు షేర్ ఇండియా రీసెర్చ్ హెడ్ రవి సింగ్ తెలిపారు. మీ వద్ద ఉన్న ఫిజికల్ గోల్డ్ ని 3 ఏళ్ల లోపు విక్రయిస్తే దాని పై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, 3 ఏళ్ల తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధిస్తారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ను ఆదాయపు పన్ను మొత్తం లో కలిపి ఇన్ కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం పన్ను లెక్కిస్తారు.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై 20 శాతం పన్నుతో పాటు 4 శాతం సెస్ అదనంగా సర్‌ఛార్జ్‌లు జోడించే అవకాశం ఉంది. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుపై 3 శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. భారత్ లో చాలా మంది ఫిజికల్ గోల్డ్, బంగారు ఆభరణాలలో ఎక్కువగా పెట్టుబడి పెడతారు. బంగారం ఆభరణాల తయారీలో మేకింగ్ ఛార్జెస్, కొనుగోలుపై 3 శాతం జీఎస్టీ, లాకర్ స్టోరేజ్ చార్జెస్, ఇన్సూరెన్స్ , ఏజెంట్ల కమీషన్‌ల మొత్త వల్ల బంగారంలో పెట్టుబడిదారులకు నష్టమని ఇది సరైన మార్గం కాదని ఎస్‌ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా అంటున్నారు.
డిజిటల్ గోల్డ్
రిటర్న్స్ విషయానికి వస్తే ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ ఎప్పుడూ ఉత్తమమని ఎస్‌ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా తెలిపారు.డిజిటల్ గోల్డ్ లో ఎక్కడ పెట్టుబడి పెడుతున్నామనే దానిని బట్టి కొన్న మొత్తానికి జీఎస్టీ తో పాటు స్వల్ప ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయి. డిజిటల్ గోల్డ్ కొనుగోలులో అప్పర్ లిమిట్ ఏమీ లేదని అయితే ఒక రోజులో రూ .2లక్షల వరకు మాత్రమే కొనవ్చని ఆయన తెలిపారు. డిజిటల్ గోల్డ్ 3 ఏళ్ల తర్వాత విక్రయిస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై 20 శాతం పన్నుతో పాటు 4 శాతం సెస్ అదనంగా సర్‌ఛార్జ్‌లు చెల్లించాలి. 3 ఏళ్ల కంటే తక్కువ కాలం ఉన్న డిజిటల్ గోల్డ్ రిటర్న్స్ పై పన్ను ఉండదు.
సావరెన్ గోల్డ్ బాండ్
సావరెన్ గోల్డ్ బాండ్లలో ఏడాదికి 4 కిలోల వరకు ఓ వ్యక్తి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఏడాది పరిమితిలో భారత ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన గోల్డ్ బాండ్స్ తో పాటు, సెకండరీ మార్కెట్‌లో కొన్న బాండ్స్ ను కలిపి లెక్కిస్తారు. అయితే బ్యాంకులలో, ఆర్థిక సంస్థల్లో కొల్లేటరల్ సెక్యూరిటీగా ఉన్న పెట్టుబడులను ఈ సీలింగ్ పరిధిలోకి తీసుకోరని ఏవీపీ రీసెర్చ్ కమోడిటీస్ అమిత్ ఖారే తెలిపారు. సావరెన్ గోల్డ్ బాండ్ కొనుగోలు పై జీఎస్టీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వీటి కొనుగోలు పై ప్రత్యక్షంగా ఎలాంటి ఛార్జెస్ లేవు సావరెన్ గోల్డ్ బాండ్ లకు ఏడాదికి 2.5 శాతం వడ్డీ వస్తుంది. ఈ మొత్తం ఆదాయపు పన్ను మొత్తానికి జోడించి ఇన్ కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం పన్ను లెక్కిస్తారు. 8 ఏళ్ల తర్వాత సావరెన్ గోల్డ్ బాండ్ లపై వచ్చే లాభానికి పన్ను వర్తించదు.
గోల్డ్ ఈటిఎఫ్ – మ్యూచువల్ ఫండ్స్
గోల్డ్ ఈటిఎఫ్ – మ్యూచువల్ ఫండ్స్ ౩ ఏళ్ల కంటే అధిక కాలం కలిగి ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కు వర్తిస్తాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై 20 శాతం పన్నుతో పాటు 4 శాతం సెస్ అదనంగా సర్‌ఛార్జ్‌లు జోడించే అవకాశం ఉంటుంది. 3 ఏళ్ల లోపు విక్రయిస్తే దాని పై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధిస్తారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ను ఆదాయపు పన్ను మొత్తం లో కలిపి ఇన్ కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ ప్రకారం పన్ను లెక్కిస్తారని షేర్ ఇండియా రీసెర్చ్ హెడ్ రవి సింగ్ తెలిపారు.
వివిధ రూపాల్లో బంగారం కొనుగోలు పెట్టుబడులపై వివిధ రకాల ఖర్చులు, పరిమితులు ఉన్నాయి. కాబట్టి పెట్టుబడి పెట్టేసమయంలో తెలివిగా ఆలోచించి బంగారంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన మార్గం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..