AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget Estimation: కొత్త బడ్జెట్లో రైల్వేకు కేటాయించే నిధులెన్ని..? గతంలో కంటే ఎక్కువ..!

భారతీయ రైల్వే వ్యవస్థ ఆధునీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త లైన్ల నిర్మాణం, రైళ్ల ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వేగవంతమైన ప్రయాణం చేేసేందుకు వీలుగా ట్రాక్ లను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏటా పార్లమెంటులో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో ఇలాంటి ఆధునీకరణ పనులకు నిధులు కేటాయిస్తారు. ప్రస్తుతం దేశంలో కేంద్ర బడ్జెట్ పై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి భారతీయ రైల్వేకు ఎన్ని నిధులు కేటాయిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Union Budget Estimation: కొత్త బడ్జెట్లో రైల్వేకు కేటాయించే నిధులెన్ని..? గతంలో కంటే ఎక్కువ..!
Railways
Nikhil
|

Updated on: Jan 19, 2025 | 3:45 PM

Share

రైల్వే వ్యవస్థ నవీకరణ పనులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాయమందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.62 లక్షల కోట్లను కేటాయించింది. వీటిలో దాదాపు 70 శాతానికి పైగా నిధులను రైల్వే వినియోగించుకుంది. రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, ఆర్యూబీలు/ఆర్వోబీల నిర్మాణం, రైల్వే లైన్ల పొడిగింపు, నారోగేజ్ ను బ్రాడ్ గేజ్ గా మార్చడం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని ఖర్చుచేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదంపూర్ – బారాముల్లా రైలు లింక్ (యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించింది. హై స్పీడ్ రైలు (హెచ్ఎస్ఆర్) విభాగంలో గణనీయమైన ప్రగతిని చూసింది. ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి 50 కిలోమీటర్ల పొడవైన కారిడార్ విద్యుద్దీకరణను ప్రారంభించింది. ఏటీపీ సిస్టమ్ అప్ గ్రేడ్ వెర్షన్ అయిన కవాచ్ 4.0ను విడుదల చేసింది. అలాగే లోకోమోటివ్, ప్యాసింజర్ కోచ్ ఉత్పత్తి చేపట్టింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి రైల్వేకు మరిన్ని నిధులు పెంచాలని భారతీయ రైల్వే మాజీ జనరల్ మేనేజర్ దేవీ ప్రసాద్ దేశ్ అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ లో రూ.3.5 లక్షల కోట్లు కేటాయించాలని కోరుతున్నారు. అంటే గత బడ్జెట్ తో పోల్చితే మరో 20 శాతం ఎక్కువ ఉండాలన్నారు. దీనివల్ల కొత్త హై స్పీడ్ కారిడార్, కవాచ్, కొత్త ట్రాక్ ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం కలుగుతుందన్నారు.

కొత్త బడ్జెట్ లో కేటాయించిన నిధులతో రైల్వే ఈ కింది తెలిపిన పనులను ప్రాధాన్యం ఇవ్వనుంది. ప్రయాణకులకు వసతులు, కొత్త లైన్ల నిర్మాణం తదితర అనేక పనులు చేపట్టనుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  • పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు 6 వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్ ల జోడింపు.
  • బ్యాక్ లాగ్ ను క్లియర్ చేయడం, ట్రాక్ ల పునరుద్దరణ, వంతెనల నిర్మాణం, పాత వాటిని మెరుగుపర్చడం, సిగ్నలింగ్ అప్ డేట్.
  • సున్నిత మైన ప్రాంతాలలో భద్రతను మెరుగుపర్చడం కోసం నిఘా, డ్రోన్ సాంకేతికతను తీసుకురావడం.
  • 2025-26 లో పది వందే భారత్ స్లీపర్ రైళ్లు నడిపేందుకు చర్యలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి