Jio Coin: క్రిప్టో కరెన్సీకి పోటీగా జియో కాయిన్.. అంబానీ ప్లాన్ ఏంటి?
Jio ప్లాట్‌ఫారమ్‌లు పాలిగాన్ బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లో కొత్త రివార్డ్ టోకెన్‌ను ప్రారంభించాయి. దీనిని JioCoin అని పిలుస్తారు. ఇది బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లో ఉన్నందున దీనిని క్రిప్టోకరెన్సీ అంటారు. ఈ టోకెన్ ప్రస్తుతం Jio స్వంత వెబ్ బ్రౌజర్ అయిన JioSphere బ్రౌజర్‌లో..

జియో కాయిన్.. ఇప్పుడు నెట్టింట దీని గురించే చర్చ జరుగుతోంది. ప్రముఖ వ్యాపార వేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండ స్ట్రీస్ పేరెంటల్ కంపెనీ జియో ప్లాట్ ఫాం.. ఇండియాలో జియో కాయిన్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నట్లు సమాచారం. క్రిప్టో కరెన్సీ డెవలపర్ అయిన పాలిగాన్ ప్రోటోకాల్స్ డెవలపర్ విభాగం అయిన పాలిగాన్ ల్యాబ్స్ తో ఇటీవల టైఅప్ కావడంతో జియో కాయిన్ గురించి చర్చ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అయితే దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే Jio Coin అంటే ఏమిటి? దానిని దేనికి ఉపయోగించవచ్చు?
ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ 3 వాట్సాప్ నంబర్లు ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా?
జియో కాయిన్
బ్లాక్‌చెయిన్ , వెబ్3 సామర్థ్యాలతో తన ఆఫర్లను మెరుగు పర్చేందుకు పాలిగాన్ ల్యాబ్‌లతో జియో ఇటీవలి టైఅప్ అయింది. అయితే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో నుంచి జియో కాయిన్ , దాని ఉపయోగాలు, ఇతర విషయాలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జియో కాయిన్ రావడం నిజమైతే.. క్రిప్టో కరెన్సీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణుల భావిస్తున్నారు. ముఖేష్ అంబానీ క్రిప్టో కరెన్సీని ఇండియాకు తీసుకురావాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, క్రిప్టో కరెన్సీ లాంటి కరెన్సీని ఇండియాలో ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. దీని కోసమే పాలిగాన్ ల్యాబ్స్ తో టైఅప్ అయినట్లు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
JioCoin అంటే ఏమిటి?
నివేదికల ప్రకారం, Jio ప్లాట్‌ఫారమ్‌లు పాలిగాన్ బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లో కొత్త రివార్డ్ టోకెన్‌ను ప్రారంభించాయి. దీనిని JioCoin అని పిలుస్తారు. ఇది బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లో ఉన్నందున దీనిని క్రిప్టోకరెన్సీ అంటారు. ఈ టోకెన్ ప్రస్తుతం Jio స్వంత వెబ్ బ్రౌజర్ అయిన JioSphere బ్రౌజర్‌లో విలీనం చేయబడింది. జియోస్పియర్ బ్రౌజర్ ద్వారా ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేసే వారికి ఈ టోకెన్ రివార్డ్ ఇస్తుందని సోషల్ మీడియాలో కొందరు వినియోగదారులు పేర్కొన్నారు.
Jiocoin wallet is LIVE!!!
Yes, yes, this is an unbelievable update! This is real… it’s happening!
You can accumulate JioCoins in a Web3 Wallet built on Polygon (A Public Blockchain).@0xAishwary @sandeepnailwal @sandeepnailwal, is it true? pic.twitter.com/2ruVMy9SRx
— Kashif Raza (@simplykashif) January 16, 2025
ఇది కూడా చదవండి: HDFC బ్యాంకు కస్టమర్ల బిగ్ అలర్ట్.. 16 గంటలు బ్యాంకు సేవలకు అంతరాయం.. ఎప్పుడో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




