- Telugu News Photo Gallery Business photos Indian railway Book Train Tickets Order Food Get Medical Help via WhatsApp
Indian Railways: రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ 3 వాట్సాప్ నంబర్లు ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా?
Indian Railways: ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 67 రైల్వే డివిజన్లు ఉన్నాయి. ఇవి 18 రైల్వే జోన్ల కింద పని చేస్తున్నాయి. భారతీయ రైల్వే సుమారు ప్రతి రోజుల లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. అయితే మీరు రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మూడు నంబర్లు మీ వద్ద ఉండటం చాలా ముఖ్యం..
Updated on: Jan 18, 2025 | 6:29 PM

చాలా మంది రైలు ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారు. అయితే మీ మొబైల్‌లో మూడు వాట్సాప్ నంబర్లు సేవ్ చేసి ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మూడు నంబర్లు మీ రైలు ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడతాయి. రైలు టికెట్ బుక్ చేసుకోవడం దగ్గర్నుంచి రైలులో ఫుడ్ ఆర్డర్ చేయడం, అనారోగ్యం వస్తే ఇలా అన్నీ వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు. ఈ మూడు నంబర్లు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.


8750001323: రైలులో కూర్చున్నప్పుడు మీకు ఆకలిగా అనిపిస్తే, చింతించకండి. మీరు మీ సీటు నుండే ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం మీరు మీ ఫోన్‌లో ఈ నంబర్‌ను సేవ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాట్సాప్‌లో మెసేజ్ పంపాలి. మీరు ఆన్-స్క్రీన్ సూచనలు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.

138: రైలులో మీకు లేదా మరెవరైనా అనారోగ్యానికి గురైతే, మీరు ఈ నంబర్ ద్వారా వైద్యుల సేవలను పొందవచ్చు. మీరు తదుపరి స్టేషన్‌లో వైద్యుల బృందాన్ని సంప్రదించవచ్చు. మీ అవసరం, పరిస్థితి ప్రకారం మీకు వైద్యులు అందుబాటులో ఉంటారు.

ఈ నంబర్లను సేవ్ చేసిన తర్వాత మీరు వాట్సాప్‌లోని చాట్ విభాగానికి వెళ్లి హాయ్ అని సందేశం పంపాలి. దీని తర్వాత మీకు సర్వీస్ ఆప్షన్ మెసేజ్ వస్తుంది. దాని నుండి మీకు కావలసిన సేవను ఎంచుకోండి. మీరు ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించాలి. ఆ తర్వాత మీ పని పూర్తవుతుంది.




