Mutual Funds: స్టార్ రేటింగ్ ఆధారంగా మ్యూచువల్ ఫడ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చా?
తక్కువ రేటింగ్ ఉన్న ఫండ్ పరిస్థితి మారవచ్చు. అత్యంత నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్ చేరవచ్చు లేదా ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) పనితీరును మెరుగుపరచడానికి దాని పెట్టుబడి విధానం లేదా ప్రక్రియలలో మార్పులు చేయవచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. సాధారణ పెట్టుబడిదారులు ఏమి చేయాలి?..
చాలా మంది పెట్టుబడిదారులు రేటింగ్‌ల ఆధారంగా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఇది సవాలుతో కూడుకున్న నిర్ణయం. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 1,500 కంటే ఎక్కువ పథకాలను అందిస్తుంది. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైన పని. ఏది ఏమైనప్పటికీ, రేటింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది పెట్టుబడిదారులకు ఉత్తమ మ్యూచువల్ ఫండ్‌లను ఎంచుకోవడంలో సహాయపడుతుందా అనేది ప్రశ్న. ముందుగా, ఫండ్ కి సంబంధించి రేటింగ్ ఎలా నిర్ణయిస్తారో అర్థం చేసుకుందాం.
వివిధ ప్రైవేట్ ఏజెన్సీల రేటింగ్‌లు సాధారణంగా నిర్దిష్ట కాలానికి రిస్క్ అడ్జస్ట్ అయిన హిస్టారికల్ రిటర్న్‌లపై ఆధారపడి ఉంటాయి. ఈ రేటింగ్‌లు ఫండ్ పనితీరును అదే వర్గంలోని ఇతర ఫండ్‌లతో పోల్చి, ఫండ్‌తో అనుసంధానించిన రిస్క్ స్థాయిని పరిగణనలోకి తీసుకుంటాయి. ఇచ్చిన రిస్క్ స్థాయిలో ఫండ్ ఎంత రాబడిని సమర్ధవంతంగా అందించగలదో ఇది సూచిస్తుంది. ఈ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ కు పర్సంటైల్స్ ఆధారంగా స్టార్స్ కేటాయిస్తారు. ఉదాహరణకు ఎంచుకున్న ఫండ్‌లలో టాప్ 10 శాతం 5-స్టార్ రేటింగ్ ఇస్తారు. అయితే దిగువ 10 శాతం ఫండ్‌లు 1-స్టార్ రేటింగ్‌ను అందుకుంటాయి.
ఇప్పుడు రేటింగ్ కేటాయించిన తర్వాత ఏమి తప్పు జరుగుతుందో అర్థం చేసుకుందాం. ఏదైనా ఫండ్ మేనేజర్‌తో పొరపాట్లు జరగవచ్చు. కొన్నిసార్లు ఫండ్ పనితీరు సరిగా ఉండదు. ఫండ్ మేనేజర్ వ్యూహంలో లోపాలు లేదా మార్పుల కారణంగా అధిక-రేటింగ్ ఉన్న 5-స్టార్ ఫండ్ పనితీరు తక్కువగా ఉండే అవకాశం ఉంది. చాలా సమర్థుడైన ఫండ్ మేనేజర్ తమ స్థానాన్ని వదిలిపెడితే కూడా అది ఫండ్ పనితీరును ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది.
అదేవిధంగా తక్కువ రేటింగ్ ఉన్న ఫండ్ పరిస్థితి మారవచ్చు. అత్యంత నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్ చేరవచ్చు లేదా ఫండ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) పనితీరును మెరుగుపరచడానికి దాని పెట్టుబడి విధానం లేదా ప్రక్రియలలో మార్పులు చేయవచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. సాధారణ పెట్టుబడిదారులు ఏమి చేయాలి? TIW క్యాపిటల్ సీఈవో మోహిత్ రాల్హాన్ ఈ విషయంపై మాట్లాడుతూ, పెట్టుబడిదారులు రేటింగ్‌ల కోసం ఉపయోగించే పారామీటర్‌లు – మెథడాలజీ గురించి తెలుసుకోవాలి. పథకం ఫండ్ మేనేజర్ ఎంత సామర్థ్యం కలిగి ఉన్నారో, ఫండ్ హౌస్ ఎలా ఉందో అలాగే దాని పెట్టుబడి పద్దతి, ఇతర మాటలలో పెట్టుబడి విధానం పటిష్టంగా ఉందో లేదో కూడా వారు అంచనా వేయాలి అని చెప్పారు.
రేటింగ్ మాత్రమే మీకు పెట్టుబడి సాధనం నాణ్యతకు తగిన అంచనాను అందించదు. మీ నిర్దిష్ట అవసరాలకు ఆ ఫండ్ సరైనదేనా అని కూడా మీరు చూడాలి. మీరు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీకు లిక్విడిటీ ముఖ్యమా లేక రాబడి ముఖ్యమా? మీరు ఎంత ప్రమాదాన్ని తట్టుకోగలరు? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మీరు మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి