AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric vehicles: ఎలక్ట్రిక్ బైక్‌పై రూ. 10,000 వరకూ తగ్గింపు, ఈ-బైక్ కొనాలనుకొంటే ఇదే బెస్ట్ టైం..

హాప్ కంపెనీ నుంచి వస్తున్న లియో, లైఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 4,000 వరకూ తగ్గింపును అందిస్తోంది. అలాగే ఓక్సో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పై ఏకంగా రూ. 10,000 తగ్గింపు లభిస్తోంది. అంతేకాక వినియోగదారులు 100శాతం ఫైనాన్స్ పై ఈ వాహనాలను కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రకటించింది.

Electric vehicles: ఎలక్ట్రిక్ బైక్‌పై రూ. 10,000 వరకూ తగ్గింపు, ఈ-బైక్ కొనాలనుకొంటే ఇదే బెస్ట్ టైం..
Hop Leo Electric Scooter
Madhu
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 16, 2023 | 8:02 PM

Share

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దానిని అందిపుచ్చుకునేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ ఉత్పత్తులను విరివిగా లాంచ్ చేస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం  మార్కెట్లో ఉన్న కొన్ని ఉత్పత్తుల ధరలను తగ్గించి, సేల్స్ చేపడుతున్నాయి. మాన్ సూన్ ఆఫర్ల పేరిట ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నాయి. వాటిలో భాగంగా జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్న హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ మాన్ సూన్ ఆఫర్లను ప్రకటించింది. విద్యుత్ శ్రేణి ద్విచక్రవాహనాలపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. వీటిల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్ లు కూడా ఉన్నాయి. హాప్ కంపెనీ నుంచి వస్తున్న లియో, లైఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 4,000 వరకూ తగ్గింపును అందిస్తోంది. అలాగే ఓక్సో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పై ఏకంగా రూ. 10,000 తగ్గింపు లభిస్తోంది. అంతేకాక వినియోగదారులు 100శాతం ఫైనాన్స్ పై ఈ వాహనాలను కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హాప్ లియో స్కూటర్..

హాప్ లియోస్కూటర్ లో 2,500వాట్ల సామర్థ్యంతో మోటార్ ఉంటుంది. గరిష్టంగా 125ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ముందు వైపు డిస్క్ బ్రేకులు ఉంటాయి. హాప్ లియో లో స్పీడ్ స్కూటర్ ధర రూ. 84,000 ఉండగా, హై స్పీడ్ స్కూటర్ ధర రూ. 97,500గా ఉంది.

హాప్ లైఫ్ స్కూటర్..

హాప్ ఎలక్ట్రిక్ 250 వాట్ల సామర్థ్యంతో మోటార్ ఉంటుంది. గరిష్టంగా 96ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ముందువైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. దీనిలోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 125కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ లో స్పీడ్ స్కూటర్ ధర రూ. 67,500గా ఉంది. అలాగే ఓక్సో ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1.48లక్షలుగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ సందర్బంగా హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రజనీష్ సింగ్ మాట్లాడుతూ వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు, సందేహాలు పడకుండా పూర్తి వివరణతో కూడిన భరోసాను కల్పిస్తున్నామన్నారు. తమ క్లయింట్‌లు స్థిరమైన మొబిలిటీ ని అందిచడానికి 100శాతం ఫైనాన్సింగ్ సొల్యూషన్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక లియో, లైఫ్, ఓక్సో ఉత్పత్తులపై తగ్గింపులను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులను కోరారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..