AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda Elevate: హోండా నుంచి అప్‌గ్రేడెడ్ ఎలివేట్ వచ్చేసింది.. ధర ఎంతంటే..

హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ పేరిట దీనిని లాంచ్ చేసింది. ఇది రెండు ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. అవి హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ వీ, వీఎక్స్. ఇది పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కేవలం రూ. 15,000 అదనపు ఖర్చుతో కొన్ని ప్రత్యేకమైన అప్ గ్రేడ్లు అందిస్తున్నట్లు వివరించింది.

Honda Elevate: హోండా నుంచి అప్‌గ్రేడెడ్ ఎలివేట్ వచ్చేసింది.. ధర ఎంతంటే..
Honda Elevate Apex Edition
Madhu
|

Updated on: Sep 19, 2024 | 3:04 PM

Share

హోండా కార్స్ ఇండియా కంపెనీ నుంచి మన దేశీయ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన కార్లలో హోండా ఎలివేట్ టాప్ పొజిషన్లో ఉంది. ఇతర కంపెనీల్లోని అనేక కార్లతో ఇది పోటీ పడుతుంది. ఈ కారుకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటంతో మంచి డిమాండ్ ఉంది. కాగా ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్లో ఈ డిమాండ్ ను అందిపుచ్చుకోడానికి హోండా కార్స్ ఇండియా ప్లాన్ చేసింది. అందుకోసం స్పెషల్ ఎడిషన్ ఎలివేట్ ను పరిచయం చేసింది. హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ పేరిట దీనిని లాంచ్ చేసింది. ఇది రెండు ట్రిమ్ లలో అందుబాటులో ఉంది. అవి హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ వీ, వీఎక్స్. ఇది పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కేవలం రూ. 15,000 అదనపు ఖర్చుతో కొన్ని ప్రత్యేకమైన అప్ గ్రేడ్లు అందిస్తున్నట్లు వివరించింది. ఈ హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ వీ ఎంటీ వేరియంట్ రూ. 12.86లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వీఎక్స్ సీవీటీ వేరియంట్ ధర రూ. 15.25లక్షల వరకూ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ డిజైన్

అపెక్స్ ఎడిషన్ కారు ముందు, వెనుక బంపర్లపై సిల్వర్ హైలైట్లతో పాటు కొత్త పియానో బ్లాక్ డోర్ గార్నిష్‌తో కూడిన పియానో బ్లాక్ యాక్సెంట్‌ను కలిగి ఉంటుంది. కారు లోపల వైపు అపెక్స్ ఎడిషన్ సాధారణ టాన్, బ్లాక్ ఇంటీరియర్ మాదిరి కాకుండా కొత్త డ్యూయల్-టోన్ ఐవరీ, బ్లాక్ స్కీము కలిగి ఉంది. డ్యాష్ బోర్డ్, డోర్ ప్యానెల్స్ పై లెథెరెట్ ట్రిమ్లుగా క్యాబిన్ కూడా అప్ గ్రేడ్ చేశారు. దీనిలో ప్రత్యేకమైన సీట్ అష్టోల్బరీ, కుషన్లు, యాంబియంట్ లైటింగ్ కూడా ఉన్నాయి. వీ, వీఎక్స్ ట్రిమ్లలో ఇతర ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి. ఆసక్తికరంగా దీనిలో అదనంగా ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ ప్యాకేజీలను కొనుగోలు చేయవచ్చు. ఇంటీరియర్ ప్యాకేజీ రూ.10,000, బాహ్య ప్యాకేజీ రూ. 5,000కి అందుబాటులో ఉంది.

హెూండా ఎలివేట్ స్పెక్స్..

హెూండా ఎలివేట్ ఆరు స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా సీవీటీతో జతచేసిన 1.5ఎల్ సహజసిద్ధమైన ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పనిచేస్తుంది. పవర్ ట్రెయిన్ 120బీహెచ్పీ, 145 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎలివేట్ తో పాటు అమేజ్, సిటీతో సహా ఇతర హెూండా మోడళ్లను సీఎన్జీ ఎంపికలతో పొందవచ్చని కంపెనీ తెలిపింది. అయితే హెూండా ఈ కిట్లను డీలర్షిప్ల ద్వారా ఆఫ్టర్ మార్కెట్ యాడ్-ఆన్ గా అందిస్తుంది. ఈ సీఎన్జీ కిట్లను మూడు మోడళ్లకు మాన్యువల్, సీవీటీ ట్రాన్స్మిషన్లలో ఇన్ స్టాల్ చేయవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు హెూండా వాహనాలపై కిట్, ఇన్ స్టాలేషన్ కోసం అదనంగా రూ. 75,000 నుంచి రూ. 85,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. డీలర్లు ఒక సంవత్సరం వారంటీని కూడా అందిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..