AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triumph: ట్రెండీ లుక్.. స్పోర్టీ ఫీచర్స్.. బజాజ్, ట్రయంఫ్ కొత్త బైక్స్ మామూలుగా లేవుగా..

బజాబ్ ఆటో రెండు కొత్త మోటారు సైకిళ్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటికి ట్రయాంఫ్ స్పీడ్ టీ4, ఎంవై 25 స్పీడ్ 400 అని పేర్లు పెట్టింది. బ్రిటీష్ మోటారు సైకిల్ బ్రాండ్ అయిన ట్రయంఫ్ తో కలిసి వీటిని రూపొందించింది. వీటి ధరలను రూ.2.17 లక్షలు, రూ.2.40 లక్షలుగా నిర్దారించింది. ఈ నెల చివరి నుంచి ఈ వాహనాలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

Triumph: ట్రెండీ లుక్.. స్పోర్టీ ఫీచర్స్.. బజాజ్, ట్రయంఫ్ కొత్త బైక్స్ మామూలుగా లేవుగా..
Triumph Speed T4 And My25 Speed 400
Madhu
|

Updated on: Sep 19, 2024 | 2:26 PM

Share

దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజమైన బజాజ్ కు వినియోగదారుల ఆదరణ చాలా ఎక్కువ. దీని నుంచి విడుదలయ్యే వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గతంలో విడుదలైన చేతక్ స్కూటర్ కు ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ఫీచర్లతో కొత్త వాహనాలను తయారు చేస్తూ బజాజ్ ఆటో ముందుకు దూసుకుపోతోంది. దీనిలో భాగంగా ఈ సంస్థ రెండు కొత్త మోటారు సైకిళ్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. వీటికి ట్రయాంఫ్ స్పీడ్ టీ4, ఎంవై 25 స్పీడ్ 400 అని పేర్లు పెట్టింది. బ్రిటీష్ మోటారు సైకిల్ బ్రాండ్ అయిన ట్రయంఫ్ తో కలిసి వీటిని రూపొందించింది. వీటి ధరలను రూ.2.17 లక్షలు, రూ.2.40 లక్షలుగా నిర్దారించింది. ఈ నెల చివరి నుంచి ఈ వాహనాలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

ట్రయంఫ్ స్పీడ్ టీ4..

ట్రయంఫ్ స్పీడ్ టీ4 మోటారు సైకిల్ రూ.2.17 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందుబాటులో ఉంది. దాని పేరులోని టి అనే అక్షరం టార్క్ ను సూచిస్తుంది. అలాగే 4 దాని 400 సీసీ ఇంజిన్‌ను తెలుపుతుంది. గతంలో తీసుకువచ్చిన స్పీడ్ 400 కంటే ఈ మోడల్ ఇంధన సామర్థ్యం పది శాతం ఎక్కువ అని కంపెనీ తెలిపింది.

  • ట్రయంఫ్ స్పీడ్ టీ4 వాహనం గంటకు గరిష్టంగా 135 కిలోమీటర్లు పరిగెడుతుంది. దీనిలో 399 సీసీ ఇంజిన్, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ యూనిట్ ఏర్పాటు చేశారు. 7,000 ఆర్పీఎం వద్ద 30.6 బీహెచ్పీ, 5,000 ఆర్పీఎం వద్ద 36 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, 6 స్పీడ్ గేర్‌బాక్స్‌, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌ ఉన్నాయి.
  • ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, అనలాగ్ డిజిటల్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్‌ తదితర ప్రత్యేకతలున్నాయి. వైట్, రెడ్, బ్లాక్ రంగుల ఎంపికలలో అందుబాటులోకి తీసుకువచ్చారు. అపోలో ఆల్ఫా హెచ్ వన్ లేదా ఎంఆర్ఎఫ్ స్టీల్ బ్రేస్ టైర్లతో, 17 అంగుళాల చక్రాలతో వస్తుంది.

ఎంవై 25 స్పీడ్ 400..

బజాజ్ ఆటో విడుదల చేసిన ఎంవై 25 స్పీడ్ 400 మోటారు సైకిల్ ధర రూ.2.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). నవీకరించిన ఈ విభాగంలో కొత్త రంగులు, డిజైన్లు తీసుకువచ్చారు. ఇది హై ప్రొఫైల్ రేడియల్ టైర్లు, ఫ్రంట్ బ్రేక్ మరియు క్లచ్ కోసం ఐదు దశల సర్దుబాటు లివర్లతో వస్తుంది. ఈ వాహనం ఎల్లో, పెరల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, ఫాంటమ్ బ్లాక్ అనే నాలుగు రకాల రంగులలో అందుబాటులో ఉంది.

  • లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8000 ఆర్పీఎం వద్ద 39 బీహెచ్ పీ పవర్, 6500 ఆర్పీఎం వద్ద 37.5 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
  • బజాజ్ ఆటో విడుదల చేసిన కొత్త వాహనాలకు మార్కెట్ లో మంచి ఆదరణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా జావా 42ఎఫ్ జే, రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350, హీరో మావ్రిక్ 440 మోడళ్లకు పోటీ ఇస్తాయని అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us