Yamaha R15M: సరికొత్తగా యమహా ఆర్15ఎం.. క్రేజీ లుక్.. కిర్రాక్ ఫీచర్స్..
యమహా ఆర్15 ఎం మోడల్ ను కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ గ్రాఫిక్స్ తో తీసుకొచ్చింది. దీని ధర రూ . 2.08లక్షలు(ఎక్స్ షోరూం) గా ఉంది. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు యమహా బ్లూ స్క్వేర్ షోరూంలకు వెళ్లాల్సి ఉంటుంది. కంపెనీ ఈ మోడల్ తో పాటు మెటాలిక్ గ్రే కలర్ ఆప్షన్లో అప్ గ్రేడెడ్ ఆర్15ఎం ను కూడా లాంచ్ చేసింది. దీని ధర ధర రూ. 1.98లక్షలు(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది.
యమహా నుంచి వచ్చే టూ వీలర్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. యమహా ఆర్ఎక్స్ 100 నుంచి ఆర్15 వరకూ ఆ ప్రత్యేకమైన కస్టమర్ బేస్ కొనసాగుతోంది. మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన యమహా ఆర్15 నుంచి కొత్త వేరియంట్ ను కంపెనీ లాంచ్ చేసింది. యమహా ఆర్15 ఎం మోడల్ ను కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ గ్రాఫిక్స్ తో తీసుకొచ్చింది. ఈ కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ అనేది ఆర్15ఎం కార్బన్ బాడీ వర్క్ నుంచి తీసుకున్నామని, దీనికి మోడర్న్ వాటర్ డిప్పింగ్ టెక్నాలజీని వినియోగించి కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ తీసుకొచ్చినట్లు యమహా ప్రకటించింది. దీని ధర రూ . 2.08లక్షలు(ఎక్స్ షోరూం) గా ఉంది. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు యమహా బ్లూ స్క్వేర్ షోరూంలకు వెళ్లాల్సి ఉంటుంది. కంపెనీ ఈ మోడల్ తో పాటు మెటాలిక్ గ్రే కలర్ ఆప్షన్లో అప్ గ్రేడెడ్ ఆర్15ఎం ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.98లక్షలు(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది. ఈ బైక్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ అంటే..
ఈ కార్బన్ ఫైబ్ ప్యాటర్న్ అనేది ఆర్15ఎం కార్బన్ బాడీ వర్క్ నుంచి తీసుకున్నామని కంపెనీ ప్రకటించింది. దీనికి మోడర్న్ వాటర్ డిప్పింగ్ టెక్నాలజీ సాయంతో కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ తీసుకొచ్చినట్లు పేర్కొంది. కాగా ఈ కొత్త ప్యాటర్న్ లో మందువైపు కౌల్, పక్కల ఫెయిరింగ్, వెనుక వైపు పార్శ్వాలను చూడొచ్చు. ఈ బైక్ కి కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ తో పాటు ఆర్15ఎంకి ఆల్ బ్లాక్ ఫెండర్, ట్యాంక్ పై కొత్త డీకాల్స్, రెండు చివర్లలో బ్లూ వీల్స్, సైడ్ ఫెయిరింగ్ కూడా ఉన్నాయి.
కొత్త ఫీచర్లు ఇవే..
ఈకొత్త మోడల్లో కేవలం గ్రాఫిక్స్ మార్పులే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్లను కూడా జోడించింది. దీనిలో టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్, మ్యూజిక్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ ఫంక్షన్‌ను కూడా పొందుతుంది. దీనిని వై-కనెక్ట్ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. బైక్‌తో కనెక్ట్ అవ్వడానికి, సింక్ చేయడానికి రైడర్ వారి స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయాలి. బైక్‌లో అప్‌గ్రేడ్ చేసిన స్విచ్ గేర్, కొత్త ఎల్ఈడీ లైసెన్స్ ప్లేట్ లైట్ కూడా ఉన్నాయి. అలాగే ఎల్ఈడీ లైటింగ్ , ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్, పూర్తిగా డిజిటల్ కలర్ టీఎఫ్టీ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి.
ఇంజిన్ సామర్థ్యం..
ఆర్15ఎం ఇంజిన్లో ఏం మార్పులు లేవు. 155సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 10,000ఆర్పీఎం వద్ద 18బీహెచ్పీ శక్తిని, 7,500ఆర్పీఎం వద్ద 14.2ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..