Honda CB300F: వాయిస్ కంట్రోల్‌తో హోండా నుంచి సరికొత్త బైక్‌ విడుదల.. ధర.. ఫీచర్స్‌ వివరాలు..!

Honda CB300F: హోండా తన కొత్త స్పోర్టీ మోటార్‌సైకిల్ CB300Fని భారతదేశంలో విడుదల చేసింది. కస్టమర్లు ఈ బైక్‌ను తమ సమీపంలోని హోండా బిగ్‌వింగ్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చని..

Honda CB300F: వాయిస్ కంట్రోల్‌తో హోండా నుంచి సరికొత్త బైక్‌ విడుదల.. ధర.. ఫీచర్స్‌ వివరాలు..!
Honda CB300F
Follow us
Subhash Goud

|

Updated on: Aug 09, 2022 | 5:25 AM

Honda CB300F: హోండా తన కొత్త స్పోర్టీ మోటార్‌సైకిల్ CB300Fని భారతదేశంలో విడుదల చేసింది. కస్టమర్లు ఈ బైక్‌ను తమ సమీపంలోని హోండా బిగ్‌వింగ్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఇది డీలక్స్, డీలక్స్ ప్రో అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువస్తోంది. డీలక్స్‌ వేరియంట్‌ ధర రూ.2,25,900 నుంచి ప్రారంభమవుతుంది. డీలక్స్ ప్రో వేరియంట్ బైక్ ధర రూ. 2,28,900 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ). ఇది మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, స్పోర్ట్స్ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తోంది.

ఈ బైక్ 293 cc ఆయిల్-కూల్డ్ 4-వాల్వ్ SOHC ఇంజిన్‌తో వస్తుంది. సుదూర పర్యటనల కోసం గొప్ప అనుభూతిని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఇది అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో డ్యూయల్ ఛానెల్ ABSని పొందుతుంది. ఇది ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది.

ఇందులో పూర్తి LED హెడ్‌ల్యాంప్‌లు, వింకర్‌లు ఇందులో ఇవ్వబడ్డాయి. మరోవైపు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ రైడర్‌కు రియల్ టైమ్/సగటు మైలేజ్, ఇంధన స్థాయి, బ్యాటరీ వోల్టేజ్, గేర్ పొజిషన్ వంటి చాలా ఫీచర్స్‌ ఉన్నాయి. మీరు డీలక్స్ ప్రో వేరియంట్‌లో హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా ఉంటుది.

ఇవి కూడా చదవండి

స్పోర్టీ ఎర్గోనామిక్స్‌తో బైక్‌ను తీసుకొచ్చారు. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బైక్ ముందు 276mm డిస్క్, వెనుక 220mm డిస్క్ ఉంటుంది. దీని బరువు 153 కిలోలు ఉండగా, సీటు ఎత్తు 789 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 177 మిమీ, ఫ్యూయల్ ట్యాంక్ 14.1-లీటర్. ఇది KTM 200 డ్యూక్, సుజుకి Gixxer 250, Yamaha FZ 25 మరియు బజాజ్ పల్సర్ N250 వంటి బైక్‌లతో పోటీపడుతుందని కంపెనీ వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి