PPF Calculator: మీరు పీపీఎఫ్‌లో నెలకు రూ.12,500 ఇన్వెస్ట్‌మెంట్‌తో కోటి రూపాయల బెనిఫిట్‌.. ఎలాగంటే..!

PPF Calculator: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) పథకం పెట్టుబడిదారులకు చాలా సురక్షితమైన పథకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అలాగే, ఈ పథకంలో పెట్టుబడిపై మంచి..

PPF Calculator: మీరు పీపీఎఫ్‌లో నెలకు రూ.12,500 ఇన్వెస్ట్‌మెంట్‌తో కోటి రూపాయల బెనిఫిట్‌.. ఎలాగంటే..!
Ppf
Follow us

|

Updated on: Aug 09, 2022 | 6:15 AM

PPF Calculator: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) పథకం పెట్టుబడిదారులకు చాలా సురక్షితమైన పథకాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అలాగే, ఈ పథకంలో పెట్టుబడిపై మంచి రాబడి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని 80C కింద PPFలో వార్షికంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అలాగే మెచ్యూరిటీ తర్వాత వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ లేదా త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన PPF ఖాతాలో సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ అందిస్తోంది. కానీ RBI రెపో రేటును పెంచిన తర్వాత అన్ని బ్యాంకులు FD పై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అయితే సెప్టెంబర్ చివరిలో ప్రభుత్వం పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. దీంతో పీపీఎఫ్‌ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. 2015-16లో పీపీఎఫ్‌కు 8.7 శాతం వడ్డీ లభించగా.. ఇప్పుడు 7.1 శాతంగా ఉంది.

25 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్‌ చేసినట్లయితే భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఇందులో నెలకు రూ.12,500 పెట్టుబడి పెట్టి 15 ఏళ్ల వరకు పీపీఎఫ్‌ ఖాతాను కొనసాగిస్తే ఖాతాదారుడు రూ.43 లక్షల వరకు సంపాదించవచ్చు. అదే ఖాతాను మెచ్యూరిటీ ఆయిన ఒక సంవత్సరంలోపు మరో ఐదు సంవత్సరాలు పొడిగింకోవచ్చు. 20 సంవత్సరాలకు 7.1 శాతానికి సంవత్సరానికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం రాబడి రూ.73 లక్షలు అవుతుంది. ఇప్పుడు కోటి రూపాయలు పొందాలంటే పెట్టుబడిదారుడు ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించాలి. ఆ తర్వాత ఏడాదికి రూ.1.5 లోల చొప్పున అన్వెస్ట్‌మెంట్‌తో మొత్తం రూ.1,16,60,769 పొందవచ్చు. అంటే కోటి రూపాయలకుపైనే తీసుకోవచ్చు.

☛ నెలవారీ పెట్టుబడి రూ.12,500, వడ్డీ 7.1 శాతంతో 15 సంవత్సరాలకు రూ.43 లక్షలు

ఇవి కూడా చదవండి

☛ నెలవారీ పెట్టుబడి రూ.12,500, వడ్డీ 7.1 శాతంతో 20 సంవత్సరాలకు రూ.73 లక్షలు

☛ నెలవారీ పెట్టుబడి 12,500, వడ్డీ 7.1 శాతంతో 25 సంవత్సరాలకు రూ.1,16,60,769.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి