Honda CB350 RS: భారత్‌లో మొదలైన హోండా కొత్త బైక్ డెలివరీలు.. రూ.2 లక్షల బైక్ ఫీచర్స్ తెలిస్తే..
Honda CB350 RS: జపాన్‌కు చెందిన ప్రముఖ బైక్ తయారీ కంపెనీ హోండా తన కొత్త బైక్ సిబి350 ఆర్‌ఎస్ బైక్‌ల డెలివరీలను ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. స్పోర్ట్ వేరియెంట్‌లో తీసుకొచ్చిన ఈ బైక్‌ను..
Honda CB350 RS: జపాన్‌కు చెందిన ప్రముఖ బైక్ తయారీ కంపెనీ హోండా తన కొత్త బైక్ సిబి350 ఆర్‌ఎస్ బైక్‌ల డెలివరీలను ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. స్పోర్ట్ వేరియెంట్‌లో తీసుకొచ్చిన ఈ బైక్‌ను హోండా గత నెలలో భారత్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కొత్త సిబి 350 ఆర్‌ఎస్.. రెండో మిడ్ సైజ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ బైక్ అని హోండా తెలిపింది. ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే.. రెడ్ మెటాలిక్ రూ.1.96 లక్షలు కాగా.. బ్లాక్ విత్ పెర్ల్ స్పోర్ట్స్ ఎల్లో కలర్ రూ.1.98 లక్షలుగా ఉంది. ఈ బైక్‌ల డెలివరీని ప్రారంభించిన హోండా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. ‘దేశంలోని యువకుల నుంచి ఈ బైక్ పట్ల మంచి స్పందన వచ్చినందుకు సంతోషిస్తున్నామ’ని తెలిపారు.
బైక్ ప్రత్యేకతలు..
350 సిసి, ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఈ బైక్ సొంతం. ఇక శక్తివంతమైన ఈ ఇంజన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 15.5 కిలోవాట్ల పవర్‌ని, 3000 ఆర్‌పిఎమ్ వద్ద 30 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ బైక్‌లో ఉన్న PGMA-FI వ్యవస్థ ఉద్గారాలను తగ్గిస్గాయి. దీంతో పొల్యుషన్ కూడా తగ్గుతుంది. ఇక ఈ బైక్ డైమెన్షన్స్ విషయానికొస్తే.. పొడవు 2171 మిల్లీమీటర్లు, 804 మిల్లీమీటర్ల వెడల్పు, 1097 మిల్లీమీటర్ల ఎత్తు ఉంది. బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 168 మిల్లీ మీటర్లు కాగా.. వీల్ బేస్ 1441 మిల్లీమీటర్లుగా ఇచ్చారు. ట్యాంక్ కెపాసిటీ విషయానికొస్తే 15 లీటర్ల పెట్రోల్ నింపుకోవచ్చు.