Honda New Car Launched: కొత్త హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్.. మతి పోగొట్టే ఇంటీరియర్స్.. ధర ఎంతంటే!
Honda New Car Launched: భారతదేశ ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఎలివేట్ మోడల్‌లో కొత్తగా అపెక్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అపెక్స్ ఎడిషన్‌గా పిలిచే ఈ కారులో ఎక్‌టీరియర్, ఇంటీరియర్ పరంగా రెగ్యులర్ ఎస్‌యూవీతో పోలీస్తే.. కొన్ని ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న గ్రేట్ హోండా ఫెస్ట్..
Honda New Car Launched: భారతదేశ ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఎలివేట్ మోడల్‌లో కొత్తగా అపెక్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అపెక్స్ ఎడిషన్‌గా పిలిచే ఈ కారులో ఎక్‌టీరియర్, ఇంటీరియర్ పరంగా రెగ్యులర్ ఎస్‌యూవీతో పోలీస్తే.. కొన్ని ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న గ్రేట్ హోండా ఫెస్ట్ ఫెస్టివల్ క్యాంపెయిన్ సందర్భంగా ఈ ఎడిషన్‌ను ప్రవేశపెట్టారు. అపెక్స్ ఎడిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్(ఎంటీ), కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (సీవీటీ) రెండింటిలోనూ పరిమిత వాల్యూమ్‌లో లభిస్తుంది. ఇది హోండా ఎలివేట్ వి, విఎక్స్ గ్రేడ్ల ఆధారంగా రూపొందించారు. దీని ధర సాధారణ వేరియంట్ కంటే రూ.15 వేలు ఎక్కువ.
డిజైన్, ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, హోండా ఎలివేట్ అధునాతన ఫీచర్ల ఆధారంగా అపెక్స్ ఎడిషన్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌తో వస్తుంది. ఇది అన్ని కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.12.86 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
అపెక్స్ ఎడిషన్ విడుదల సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కునాల్ బహల్ మాట్లాడారు. ‘ఎలివేట్ మా విజయంలో కీలక పాత్ర పోషించింది. మా దేశీయ అమ్మకాలు, ఎగుమతులకు ఉపయోగపడింది. భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. హోండా ఎలివేట్ కొత్త అపెక్స్ ఎడిషన్‌ను లాంచ్ చేయడం మాకు సంతోషంగా ఉంది. ఇది మెరుగైన క్యాబిన్ అనుభవం కోసం విలాసవంతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. డైనమిక్, స్టైలిష్ అప్పీల్‌ను పెంచే కొత్త బోల్డ్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంది. ఈ కొత్త కారుతో హోండా ఫ్యామిలీలోకి మరింత మంది కస్టమర్లను ఆహ్వానించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.’ అని కునాల్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Ambani: అంబానీ కుటుంబం తాగే పాలు ఎంత ప్రత్యేకమో తెలుసా? ధర తెలిస్తే షాకవుతారు!
అపెక్స్ ఎడిషన్ ఎక్స్ టీరియర్ మెరుగుదలలు:
- సిల్వర్ యాక్సెంట్‌తో స్పాయిలర్ కింద పియానో బ్లాక్ ఫ్రంట్
- స్పాయిలర్ కింద పియానో బ్లాక్ సైడ్
- క్రోమ్ ఇన్సర్ట్‌లతో పియానో బ్లాక్ రియర్ లోయర్ గార్నిష్
- ఫెండర్‌లపై అపెక్స్ ఎడిషన్ బ్యాడ్జ్
- టెయిల్‌గేట్‌పై అపెక్స్ ఎడిషన్ లోగో
ఇంటీరియర్:
- విలాసవంతమైన డ్యూయల్-టోన్ ఐవరీ, బ్లాక్ ఇంటీరియర్స్
- ప్రీమియం లెదరెట్ డోర్ లైనింగ్స్
- ప్రీమియం లెదరెట్ ఐపీ ప్యానెల్
- రిథమిక్ యాంబియంట్ లైట్లు – 7 కలర్స్
- అపెక్స్ ఎడిషన్ సిగ్నేచర్ సీట్ కవర్లు, కుషన్లు
- ఇవి ఎలివేట్ V, VX గ్రేడ్‌లకు సంబంధించి అపెక్స్ ఎడిషన్ ప్యాకేజీగా విభిన్న కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా, పరిమిత కాలానికి అందుబాటులో ఉన్నాయి.
ఎలివేట్ స్టాండర్డ్ వేరియంట్ (ఎక్స్-షోరూమ్ ధరలు)
- VMT: రూ.12,71,000 – రూ.12,86,000
- VCVT: రూ.13,71,000 – రూ.13,86,000
- VX MT: రూ.14,10,000 – రూ.14,25,000
- VX CVT: రూ.15,10,000 – రూ.15,25,000
ఇది కూడా చదవండి: iPhone: ఏ దేశంలో ఐఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? భారత్‌లో ఎంత మంది తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి