AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Usage: క్రెడిట్‌ కార్డుల ద్వారా ఇంటి రెంట్‌ ‍పేమెంట్‌.. పైగా కళ్లుచెదిరే ప్రయోజనాలు..

వస్తువులు, సేవలకు సంబంధించిన చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డ్‌లు అత్యంత ఉపయోగకరమైన మార్గాలలో ఒకటిగా మారాయి. ఎందుకంటే ఇవి వినియోగదారుని నిర్ణీత వ్యవధి తర్వాత చెల్లింపు చేయడానికి అనుమతిస్తాయి. చెల్లింపు చేయడానికి సాధారణంగా ఒక నెల  సమయం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డుల ట్రెండ్ పెరుగుతోంది. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులు, షాపింగ్, మరెన్నో అవసరాలకు క్రెడిట్‌ కార్డులను వినియోగిస్తున్నారు.

Credit Card Usage: క్రెడిట్‌ కార్డుల ద్వారా ఇంటి రెంట్‌ ‍పేమెంట్‌.. పైగా కళ్లుచెదిరే ప్రయోజనాలు..
Nikhil
| Edited By: |

Updated on: Oct 21, 2023 | 10:20 PM

Share

ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. ముఖ్యంగా డబ్బు లావాదేవీలను సులభతరం చేసింది. డెబిట్‌ కార్డుల మన అకౌంట్‌లో ఉన్న నిల్వ ఆధారంగా పని చేస్తాయి. అయితే క్రెడిట్‌ కార్డులు మాత్రం మనకు ఆ కంపెనీల ఇచ్చిన లిమిట్‌ ఆధారంగా పని చేస్తాయి. ముఖ్యంగా వస్తువులు, సేవలకు సంబంధించిన చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డ్‌లు అత్యంత ఉపయోగకరమైన మార్గాలలో ఒకటిగా మారాయి. ఎందుకంటే ఇవి వినియోగదారుని నిర్ణీత వ్యవధి తర్వాత చెల్లింపు చేయడానికి అనుమతిస్తాయి. చెల్లింపు చేయడానికి సాధారణంగా ఒక నెల  సమయం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డుల ట్రెండ్ పెరుగుతోంది. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపులు, షాపింగ్, మరెన్నో అవసరాలకు క్రెడిట్‌ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంటి అద్దె చెల్లించేందుకు కూడా క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రస్తుతం క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఇంటి రెంట్‌ను ఎలా చెల్లించాలో? ఓ సారి తెలుసుకుందాం.

ఇంటి యజమాని క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లింపులను అంగీకరించకపోయినా థర్డ్-పార్టీ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌ల ద్వారా అద్దె చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపులు చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల చాలా రివార్డ్‌లను కూడా అందించవచ్చు. దేశంలో పేటీఎం, ఫోన్‌పే, క్రెడ్‌, నో బ్రోకర్‌, పేజాప్‌, రెడ్‌ జిరాఫీ వంటి అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, యూపీఐ యాప్‌లు వినియోగదారులను క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లింపులను చేయడానికి అనుమతిస్తాయి. యజమాని బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను నమోదు చేయడం ద్వారా అద్దెను సులభంగా బదిలీ చేయవచ్చు. రూ.50,000 కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే అప్పుడు యజమాని పాన్ కార్డ్ నంబర్ కూడా అవసరం.

ఇవి కూడా చదవండి

క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంటి అద్దె చెల్లించడం ఇలా

  • స్టెప్‌- 1: ఏదైనా ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్ వెబ్‌సైట్ లేదా యూపీఐ యాప్‌కి వెళ్లాలి.
  • స్టెప్‌- 2: అద్దె చెల్లింపు ఎంపికను ఎంచుకోవాలి.
  • స్టెప్‌- 3: ఇల్లు లేదా దుకాణం అద్దె, నిర్వహణ, ఆస్తి డిపాజిట్‌ను ఎంచుకోవాలి.
  • స్టెప్‌- 4: అద్దె మొత్తం, ఆస్తి పేరును నమోదు చేయాలి.
  • స్టెప్‌- 5: కొనసాగించుపై నొక్కాలి.
  • స్టెప్‌- 6: యజమాని పేరును నమోదు చేయాలి.
  • స్టెప్‌- 7: చెల్లింపు పద్ధతిగా క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.
  • స్టెప్‌- 8: యజమాని బ్యాంక్ ఖాతా లేదా యూపీఐను ఎంచుకోవాలి.
  • స్టెప్‌- 9: బ్యాంక్‌కి లింక్ చేసిన క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె మొత్తాన్ని చెల్లించాలి.

క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లించడం ద్వారా వారి నగదును ఆదా చేసుకోవచ్చు.
  • క్రెడిట్ కార్డ్ బకాయిలు సాధారణంగా 45-50 రోజుల తర్వాత చెల్లించవచ్చు. ఈ సమయంలో, అదే డబ్బును వేరే చోట ఉపయోగించవచ్చు.
  • క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించడం కూడా ఈఎంఐలా మార్చకోవచ్చు.
  • క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే లావాదేవీలపై అనేక క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్‌లు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్