Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: ఉద్యోగం లేని వారికి బ్యాంకులు హోమ్‌ లోన్‌ ఎలా ఇస్తాయి.? ఎలాంటి డాక్యుమెంట్స్‌ అవసరం.

ప్రైవేటు బ్యాంకుల రాకతో బ్యాంకుల మధ్య పోటీ సైతం పెరిగింది. దీంతో వినియోగదారులను ఆకర్షిస్తూ రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. తక్కువ వడ్డీకే ఇంటి రుణాలను అందిస్తూ ఖాతాదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఇంటి రుణం పొందాలంటే కచ్చితంగా ఏదైనా ఉద్యోగం ఉండాలనే భావనలో ఉంటాం. నెలనెల కచ్చితమైన ఆదాయంతో పాటు మంచి సిబిల్ స్కోర్‌ ఉన్న వాళ్లకే బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి...

Home Loan: ఉద్యోగం లేని వారికి బ్యాంకులు హోమ్‌ లోన్‌ ఎలా ఇస్తాయి.? ఎలాంటి డాక్యుమెంట్స్‌ అవసరం.
Home Loan
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 21, 2023 | 8:27 PM

సొంతిళ్లు నిర్మించుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల. చిన్నదో పెద్దదో తమకంటూ ఓ ఇల్లు ఉండాలని చాలా మంది ఆశిస్తుంటారు. అందుకోసమే జీవితాంతం కష్టపడి పని చేస్తుంటారు. రూపాయి రూపాయి జమ చేసి సొంతింటి కలను నిజం చేసుకుంటారు. ఇక బ్యాంకింగ్‌ సేవలు విస్తృతంగా పెరిగిన తర్వాత రుణాలు సులభతరంగా మారాయి.

ప్రైవేటు బ్యాంకుల రాకతో బ్యాంకుల మధ్య పోటీ సైతం పెరిగింది. దీంతో వినియోగదారులను ఆకర్షిస్తూ రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. తక్కువ వడ్డీకే ఇంటి రుణాలను అందిస్తూ ఖాతాదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఇంటి రుణం పొందాలంటే కచ్చితంగా ఏదైనా ఉద్యోగం ఉండాలనే భావనలో ఉంటాం. నెలనెల కచ్చితమైన ఆదాయంతో పాటు మంచి సిబిల్ స్కోర్‌ ఉన్న వాళ్లకే బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. ఇందులో నిజం ఉన్నా.. ఎలాంటి ఉద్యోగం లేకపోయినా బ్యాంకులు హోమ్‌ లోన్స్‌ ఇస్తుంటాయి. అయితే ఇందుకోసం బ్యాంకులు కొన్ని నిబంధనలు పాటిస్తాయి. ఇంతకీ ఉద్యోగం లేకపోయినా బ్యాంకులు హోమ్‌ లోన్స్‌ ఎలా ఇస్తాయి.? ఇందకోసం ఎలాంటి డ్యాక్యుమెంట్స్ అవసరం లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఉద్యోగం కాకుండా వ్యాపారం లాంటి స్వయం ఉపాధి పొందే వారికి లోన్స్‌ ఇచ్చే సమయంలో బ్యాంకులు పలు విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి. ఇలాంటి వారికి రుణాలు ఇచ్చే ముందు బ్యాంకులు మొదట పరిగణలోకి తీసుకునే అంశం వయసు. బ్యాంకులు ఎక్కువ వరకు యువకులకు మాత్రమే రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటాయి. యువకులు అయితే రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఎక్కువ సమయం ఉంటుందనేది బ్యాంకుల అభిప్రాయం.

ఇక స్వయం ఉపాధిపై ఆధారపడి జీవనం సాగించే వారికి హౌజ్‌ లోన్‌ ఇచ్చే సమయంలో ఆర్థికపరమైన డాక్యుమెంట్లను పరిశీలిస్తాయి. రెండేళ్ల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌తోపాటు, లాభనష్టాలు, బ్యాలెన్స్‌ షీట్‌ వంటి వివరాలను డాక్యుమెంట్ రూపంలో అందించాల్సి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి రుణాలు ఇచ్చే సమయంలో బ్యాంకులు నికర ఆదాయాన్ని లెక్కిస్తాయి. లాభనష్టాలను అంచనా వేసి ఏడాదికి ఎంత నికర ఆదాయం వస్తుందన్న దాన్ని లెక్కించిన తర్వాత లోన్‌ ఇస్తారు.

రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ లేని వారికి లోన్ ఇచ్చే ముందు చూసే మరో అంశం.. వ్యాపారం స్థిరత్వాన్ని బ్యాంకులు తనిఖీ చేస్తాయి. వ్యాపారం వృద్ధితో పాటు భవిష్యత్తు కూడా అంచనా వేస్తారు. వీటి ఆధారంగా కూడా రుణాలు ఇస్తాయి బ్యాంకులు. ఇదిలా ఉంటే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటును చాలాసార్లు పెంచడం వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో గతంతో పోల్చితే ప్రస్తుతం హౌజ్‌ లోన్స్‌పై ఇంట్రెస్ట్‌ ఎక్కువగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..