AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: నెలకు రూ.2 లక్షల ఆదాయం తెచ్చే అద్భుతమైన బిజినెస్‌! జస్ట్‌ మెయిటేనెన్స్‌ చేస్తే చాలు..

పెట్టుబడి భయంతో బిజినెస్ చేయాలనుకునే వారికి క్యాంటీన్ వ్యాపారం అద్భుత అవకాశం. పట్టణాలు, నగరాల్లోని కంపెనీలు, స్కూళ్లు, హాస్పిటల్స్ వంటి చోట్ల క్యాంటీన్ నిర్వహించడం ద్వారా నెలకు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. 5-10 లక్షల పెట్టుబడితో ఈ లాభదాయకమైన బిజినెస్ ప్రారంభించి, మీ కలను నిజం చేసుకోండి.

Business Ideas: నెలకు రూ.2 లక్షల ఆదాయం తెచ్చే అద్భుతమైన బిజినెస్‌! జస్ట్‌ మెయిటేనెన్స్‌ చేస్తే చాలు..
Loan India
SN Pasha
|

Updated on: Dec 01, 2025 | 11:00 AM

Share

చాలా మందికి మంచి బిజినెస్‌ చేయాలని ఉంటుంది. కానీ, పెట్టుబడి లేక, భయం వల్ల, ఇప్పుడే కాదులే అని ఆగిపోతుంటారు. కానీ, సరైన బిజినెస్‌ ఐడియా గురించి తెలుసుకుంటే లక్షలు సంపాదించే మార్గాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఇప్పుడు అలాంటి ఓ బిజినెస్‌ ఐడియా గురించే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి ఈ ఐడియా ఉపయోగపడొచ్చు. లేదా పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లి స్థిరపడాలని అనుకుంటున్న వారికి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే సిటీల్లో కంపెనీలు, స్కూల్స్‌, కాలేజీలు, హాస్పిటల్స్‌ వంటి ఎక్కువ మంది జనం ఉంటే ప్రాంగణాలు. వందలు, వేల మంది ఉండే ఈ ప్రాంగణాల్లో కచ్చితంగా ఒక క్యాంటిన్‌ ఉంటుంది. లేనివి కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని వెతికి పట్టుకుంటే చాలు మీ బిజినెస్‌ అయిపోయినట్టే.

సదరు కంపెనీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుకొని వారి కాలేజీలోనో, హాస్పిటల్‌లోనో లేక ఆఫీస్‌లోనో క్యాంటిన్‌ నిర్వహించేందుకు అనుమతి తీసుకోండి. అందుకోసం కంపెనీకి ఏడాదికి ఇంత మొత్తం కమీషన్‌ కూడా మాట్లాడుకొండి. నిత్యం జనం ఉంటే పెద్ద పెద్ద క్యాంపస్‌లో జనం బయటికి వెళ్లి తినే బదులు, అక్కడే అందుబాటులో ఉన్నవి తినేందుకు ఇష్టపడతారు. సో బిజినెస్‌ అద్భుతంగా జరుగుతుంది. అయితే ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేసేందుకు ఓ రూ.5 నుంచి రూ.10 లక్షల పెట్టుబడి కూడా అవుతుంది. సరిగ్గా ప్లాన్‌ చేస్తే మాత్రం నెలకు రూ.2 లక్షల ఆదాయం ఎక్కడిపోదు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి