Auto News: హీరో డెస్టిని, గ్లామర్ X, ఎక్స్‌ట్రీమ్ బైక్‌లపై భారీ తగ్గింపు!
Auto News: మోడల్ వారీగా ఖచ్చితమైన ధరల జాబితాపై ఎటువంటి అప్‌డేట్ లేదు. కానీ మోడల్‌ను బట్టి తగ్గింపులు రూ. 15,743 వరకు పెరుగుతాయని హీరో పేర్కొంది. కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వస్తాయి. హీరో కు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది..

Auto News: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన తర్వాత సెప్టెంబర్ 22 నుంచి చాలావాటి ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. కొత్త GST శ్లాబులకు ప్రతిస్పందనగా హీరో మోటోకార్ప్ తన మోటార్ సైకిళ్ళు, స్కూటర్ల ధరలు గణనీయంగా తగ్గుతాయని ధృవీకరించింది. మోడల్ వారీగా ఖచ్చితమైన ధరల జాబితాపై ఎటువంటి అప్‌డేట్ లేదు. కానీ మోడల్‌ను బట్టి తగ్గింపులు రూ. 15,743 వరకు పెరుగుతాయని హీరో పేర్కొంది. కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వస్తాయి. హీరో కు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. దీని ప్రసిద్ధ మోటార్‌సైకిల్ సిరీస్‌లో స్ప్లెండర్, ప్యాషన్, HF, గ్లామర్, ఎక్స్‌ట్రీమ్ ఉన్నాయి. అయితే స్కూటర్ శ్రేణిలో డెస్టిని, జూమ్ ఉన్నాయి. మోడల్ వారీగా ధర తగ్గింపుల గురించి తెలుసుకుందాం. అయితే ఇవి ఖచ్చితమైన తగ్గింపులు ఉండకపోవచ్చు. తర్వాత కంపెనీ తీసుకునే నిర్ణయంపై తగ్గింపుల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చని గమనించండి.
Viral Video: ఏం తెలివిరా నాయనా.. ఈ వీడియో చూస్తే అవునా నిజమా అనడం ఖాయం!
| Model | Max GST Benefit (Up to) |
| Destini 125 | Rs 7,197 |
| Glamour X | Rs 7,813 |
| HF Deluxe | Rs 5,805 |
| Karizma 210 | Rs 15,743 |
| Passion+ | Rs 6,500 |
| Pleasure+ | Rs 6,417 |
| Splendor+ | Rs 6,820 |
| Super Splendor XTEC | Rs 7,254 |
| Xoom 110 | Rs 6,597 |
| Xoom 125 | Rs 7,291 |
| Xoom 160 | Rs 11,602 |
| Xpulse 210 | Rs 14,516 |
| Xtreme 125R | Rs 8,010 |
| Xtreme 160R 4V | Rs 10,985 |
| Xtreme 250R | Rs 14,055 |
ఈ ప్రకటనపై హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ కస్బేకర్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం తదుపరి తరం GST 2.0 సంస్కరణలను స్వాగతిస్తున్నామని అన్నారు. ఇది వినియోగాన్ని పెంచుతుంది. GDP వృద్ధిని శక్తివంతం చేస్తుంది. భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. అదనంగా భారతీయ కుటుంబాలలో సగానికి పైగా తమ రోజువారీ అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: Dussehra Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
కాగా, హీరో మోటోకార్ప్ ఆగస్టు 2025లో మొత్తం 5.54 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే నెలతో 5.12 లక్షల యూనిట్లను విక్రయించింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే 8.07% పెరుగుదలను సూచిస్తుంది.
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
దేశీయ మార్కెట్లో అమ్మకాలు 5.46% వృద్ధితో 5.19 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇంతలో అంతర్జాతీయ ఎగుమతులు 34,588కి చేరుకున్నాయిజ ఇది గత సంవత్సరంతో పోలిస్తే 72.11% పెరుగుదల.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








