- Telugu News Photo Gallery Business photos PM Kisan: Government has issued notification regarding PM Kisan Yojana, when will the 21st installment be received?
PM Kisan: పీఎం కిసాన్‌కు సంబంధించి కేంద్రం కీలక నోటిఫికేషన్.. 21వ విడత ఎప్పుడు వస్తుంది?
PM Kisan: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు 21వ విడత కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ విడత రైతుల బ్యాంకు ఖాతాకు..
Updated on: Sep 15, 2025 | 3:57 PM

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల రైతుల కోసం ప్రభుత్వం ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు 21వ విడత కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ విడత రైతుల బ్యాంకు ఖాతాకు మూడు సమాన వాయిదాలలో అంటే ప్రతి విడత రూ.2,000 చొప్పున జమ చేస్తోంది.

నోటిఫికేషన్‌లో ఏం ఉంది?: ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేసిన లేదా స్వంతం చేసుకున్న రైతులపై కొన్ని అక్రమ కేసులు గుర్తించాని కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కుటుంబాలు ఉన్నాయి. ఉదాహరణకు భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు, 18 ఏళ్లు పైబడిన వారి కుమారులు, కుమార్తెలు ఇద్దరూ కలిసి వాయిదాల డబ్బును తీసుకుంటున్నారు. అంటే చాలా మంది హక్కుదారులు ఒకే భూమిని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఇలాంటి సందర్భాల్లో వాయిదా చెల్లింపు ప్రస్తుతానికి నిలిపివేసింది కేంద్రం. రైతులు తమ అర్హతను తనిఖీ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. దీని కోసం నో యువర్ స్టేటస్ అంటే KYC సేవ అందుబాటులో ఉంది. దీనిని PM కిసాన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా కిసాన్ ఇ-మిత్రా చాట్‌బాట్ ద్వారా ఉపయోగించవచ్చు.

వాయిదా ఎందుకు ఆపివేసింది?: అటువంటి కేసుల భౌతిక ధృవీకరణ జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు తదుపరి విడత ఆ రైతుల ఖాతాలకు జమ కాదని తెలిపింది. పథకం పూర్తి అర్హత ఉన్న వ్యక్తులు మాత్రమే దీని ప్రయోజనం పొందేలా చూడటం దీని ఉద్దేశ్యం.

ఇప్పటివరకు ఎన్ని విడతలు విడుదలయ్యాయి?: ప్రభుత్వం ఇప్పటివరకు 20 వాయిదాలను విడుదల చేసింది. ఇటీవల 20వ విడత 2025 ఆగస్టు 2న రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడింది.

21వ విడత ఎప్పుడు వస్తుంది?: తదుపరి విడత విషయానికొస్తే దీపావళికి ముందే తమకు అది లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. కానీ గత సంవత్సరాల ట్రాక్‌ను పరిశీలిస్తే వాయిదా డిసెంబర్ 2025లో రావచ్చు. ప్రభుత్వం ప్రతి 4 నెలలకు వాయిదాలను విడుదల చేస్తుంది.




