క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్లు చేయడం ఎలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..
Link UPI Credit Card to BHIM App: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) క్రెడిట్ కార్డు తో యూపీఐ లావాదేవీలు చేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకోసం ప్రత్యేకంగా రూపే క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. అసలు ఈ రూపే క్రెడిట్ కార్డు ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఏయే బ్యాంకులు దీనికి సపోర్టు చేస్తాయి? తెలుసుకుందాం రండి..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) కాన్సెప్ట్ మన దేశంలో దూసుకుపోతోంది. గత మూడేళ్ల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాంకింగ్ విధానం ఇది. ముఖ్యంగా కరోనా అనంతర పరిణామాల్లో ప్రభుత్వ క్యాష్ లెస్ పేమెంట్లు, డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించడంతో యూపీఐ పేమెంట్లకు మేలు చేసింది. మన వీధి చివర చిన్న పాన్ షాపు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ అన్నిచోట్ల యూపీఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు దీని పరిధిని మరింత విస్తరిస్తూ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) క్రెడిట్ కార్డు తో యూపీఐ లావాదేవీలు చేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకోసం ప్రత్యేకంగా రూపే క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. అసలు ఈ రూపే క్రెడిట్ కార్డు ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఏయే బ్యాంకులు దీనికి సపోర్టు చేస్తాయి? తెలుసుకుందాం రండి..
గత సంవత్సరం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐ యాప్‌లతో లింక్ చేయడానికి అనుమతించింది. రూపే క్రెడిట్ కార్డ్‌ని యూపీఐ క్రెడిట్ కార్డ్ అని కూడా పిలుస్తారు. మీరు సాధారణంగా బ్యాంక్ ఖాతాతో చేసే విధంగానే యూపీఐ చెల్లింపులను చేయడానికి రూపే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఈ సందర్భంలో, డబ్బు మీ రూపే క్రెడిట్ ఖాతా నుంచి కట్ అవుతుంది.
భారతీయ మార్కెట్లో రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి యూపీఐ వ్యాపార లావాదేవీలను ప్రారంభించేందుకు, ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) భారత్ పే, క్యాష్ ఫ్రీ పేమెంట్స్, గూగుల్ పే, రాజోర్ పే, పేటీఎం, పేయూ, పైన్ ల్యాబ్స్ వంటి ముఖ్యమైన వాటిల్లో అవకాశం కల్పించినట్లు పేర్కొంది.
మన దేశంలో క్రెడిట్ కార్డు హోల్డర్లు..
భారతదేశంలో దాదాపు 50 మిలియన్ల యూపీఐ వినియోగదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ యూపీఐని ఉపయోగించే వారు 250 మిలియన్ల మంది ఉన్నారు. వినియోగదారులకు యూపీఐ యొక్క వేగవంతమైన చెల్లింపు అనుభవాన్ని అందించడం ద్వారా స్వల్పకాలిక క్రెడిట్, రివార్డు సదుపాయాలను అందించేందుకు ఆర్బీఐ కసరత్తు చేసింది.
ఎలా చెల్లించాలంటే..
మీ బ్యాంక్ ఖాతాల నుంచి యూపీఐ ద్వారా చెల్లించే పద్ధతి ఒకటే. మీరు క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయాలి. అయితే, రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా, మీరు కేవలం వ్యాపారి యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా లేదా ఆన్‌లైన్ వ్యాపారులకు చెల్లింపులు చేయడం ద్వారా చెల్లించవచ్చు. అయితే మీరు పీ2పీ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడం వంటి కొన్ని కార్యకలాపాలు దీని ద్వారా చేయలేరు. భీమ్ యాప్‌తో పాటు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, స్లైస్, మొబైల్ క్విక్, పేజాప్, ఫ్రీ చార్జ్ వంటి కొన్ని బ్యాంకుల రూపే క్రెడిట్ కార్డ్‌లను అనుమతిస్తాయి.
ఎన్పీసీఐ ఆపరేటర్లు రూపే క్రెడిట్ కార్డ్‌లను భీమ్ యాప్‌లో 11 రకాల బ్యాంకుల లింక్ చేయవచ్చు. అవేంటంటే యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్
భీమయ్ యాప్‌తో రూపే కార్డ్‌ని ఎలా లింక్ చేయాలంటే..
- ముందుగా, భీమ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
- దీని తర్వాత లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు +పై క్లిక్ చేస్తే, యాడ్ అకౌంట్ – బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ అనే 2 ఎంపికలు కనిపిస్తాయి.
- క్రెడిట్ కార్డ్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీ మొబైల్ నంబర్‌కి లింక్ చేయబడిన క్రెడిట్ కార్డ్ వివరాలను బహిర్గతం చేయడానికి సంబంధిత కార్డ్‌ని ఎంచుకోండి.
- ఇప్పుడు చివరి 6 అంకెలు, క్రెడిట్ కార్డ్ చెల్లుబాటును నమోదు చేయండి.
- దీని తర్వాత మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి.
- యూపీఐ పిన్‌ని సృష్టించండి. దీంతో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
- ఇప్పుడు వ్యాపారి యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, రూపే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకుని, యూపీఐ పిన్ ని నమోదు చేయడం ద్వారా చెల్లింపును పూర్తి చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..