NPS: నెలకు రూ. 50వేలు పెన్షన్‌ రావాలంటే.. ఇలా చేయండి..

మార్కెట్లో అనేక రకాల పదవీవిరమణ పథకాలు అందుబాటులో ఉన్నా.. బెస్ట్‌ పథకాన్ని ఎంపిక చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు. అయితే ప్రభుత్వం మద్దతుతో ఉండే నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌) మాత్రం ఈ పదవీవిరమణ పథాకాలలో అత్యంత ఆదరణ పొందుతోంది. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎస్‌ఆర్డీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనిలో ప్రతి నెలా పెట్టుబడి పెట్టడం వల్ల పదవీవిరమణ తర్వాత పెన్షన్‌ పొందొచ్చు.

NPS: నెలకు రూ. 50వేలు పెన్షన్‌ రావాలంటే.. ఇలా చేయండి..
Pension Scheme
Follow us

|

Updated on: Jun 27, 2024 | 6:49 PM

పదవీవిరమణ సమయంలో నిశ్చింతగా ఉండాలంటే ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక అవసరం. మార్కెట్లో అనేక రకాల పదవీవిరమణ పథకాలు అందుబాటులో ఉన్నా.. బెస్ట్‌ పథకాన్ని ఎంపిక చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు. అయితే ప్రభుత్వం మద్దతుతో ఉండే నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌) మాత్రం ఈ పదవీవిరమణ పథాకాలలో అత్యంత ఆదరణ పొందుతోంది. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎస్‌ఆర్డీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనిలో ప్రతి నెలా పెట్టుబడి పెట్టడం వల్ల పదవీవిరమణ తర్వాత పెన్షన్‌ పొందొచ్చు. రూ. 500 నుంచి రూ. లక్ష వరకూ దీనిలో పెన్షన్‌ పొందే అవకాశం ఉంది. ఎన్‌పీఎస్‌ పథకం ద్వారా నెలకు రూ. 50,000 పెన్షన్‌ పొందాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి? తెలుసుకుందాం రండి..

ఎన్‌పీఎస్‌ అంటే ఏమిటి?

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌) అనేది 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల పౌరులందరికీ అందుబాటులో ఉన్న మార్కెట్-లింక్డ్, డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ పెట్టుబడి పథకం. దీని సాయంతో వ్యక్తులు వారి పదవీవిరమణ తర్వాత స్థిరమైన పెన్షన్‌ పొందేందుకు ఇది అనుమతిస్తుంది.

నెలవారీ రూ. 50,000 పొందడం ఎలా?

మీరు ఎన్‌పీఎస్‌ ద్వారా నెలకు రూ. 50,000 పెన్షన్ను పొందాలంటే.. ఎంత పెట్టుబడి పెట్టాలి? ఏ వయసులో పెట్టుబడి పెట్టాలి? ఏ వయస్సు నుంచి పెన్షన్‌ వస్తుంది? చూద్దాం రండి.. మీకు నెలకు తక్కువ పెట్టుబడి కావాలంటే, చిన్న వయస్సులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీకు ప్రస్తుతం 25 సంవత్సరాలు అనుకోండి.. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు అని అనుకుంటే.. లెక్క ఇలా ఉంటుంది.

  • మీకు 25 ఏళ్లు వచ్చినప్పుడు పెట్టుబడి ప్రారంభమవుతుంది.
  • పదవీ విరమణ వయస్సు: 60 సంవత్సరాలు
  • పెట్టుబడి కాలపరిమితి: 35 సంవత్సరాలు
  • ఆశించిన రాబడి: సంవత్సరానికి 10 శాతం
  • నెలవారీ పెట్టుబడి: రూ.6,550
  • మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 2,50,75,245
  • మీరు పదవీ విరమణ సమయంలో విత్‌డ్రా చేయగల మొత్తం: పెట్టుబడిలో 60 శాతం. అంటే మొత్తం పెట్టుబడి  రూ. 2,50,75,245కాగా దానిలో 60 శాతం, అంటే రూ. 1,50,45,147 విత్‌ డ్రా చేసుకోవచ్చు.
  • ఇప్పుడు, యాన్యుటీలో పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 1,00,30,098
  • ఆశించిన నెలవారీ రాబడి: రూ.50,150

నెలవారీ రాబడి..

ఎన్పీఎస్ నుంచి పొందే పెన్షన్ మొత్తం కంట్రీబ్యూషన్‌ పరిమాణం, మెచ్యూరిటీ తర్వాత యాన్యుటీని కొనుగోలు చేయడానికి ఉపయోగించే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఎన్పీఎస్‌ పెట్టుబడులు మార్కెట్ పరిస్థితులకు అనుసంధానించి ఉంటాయి. ఈ పథకం నిర్దిష్ట ప్రయోజనాలకు హామీ ఇవ్వదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..