AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj CNG: దేశంలోనే తొలి సీఎన్జీ బైక్.. 110సీసీ ఇంజిన్ పెట్రోల్‌తో కూడా పనిచేస్తుంది..

ఇప్పటి వరకూ ఈ సీఎన్జీ వేరియంట్లో కార్లు, బస్సులు, ఆటోలు ఎక్కువగా మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకూ ద్విచక్ర వాహనాల్లో సీఎన్జీ వేరియంట్ ఏదీ లేదు. అయితే రానున్న కొద్ది రోజుల్లో బజాజ్ కంపెనీ నుంచి ఓ సీఎన్జీ బైక్ రానుందని తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అది కూడా బజాజ్ 110 సీసీ ప్లాటినా బైక్ ఈ సీఎన్జీ వేరియంట్లో రానున్నట్లు చెబుతున్నారు.

Bajaj CNG: దేశంలోనే తొలి సీఎన్జీ బైక్.. 110సీసీ ఇంజిన్ పెట్రోల్‌తో కూడా పనిచేస్తుంది..
Bajaj Platina
Madhu
| Edited By: |

Updated on: Oct 23, 2023 | 11:00 AM

Share

కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) తక్కువ ధర, పూర్తి పర్యావరణ హిత ఇంధనం. పైగా అధిక మైలేజీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిళ్లకు మంచి ప్రత్యామ్నాయంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలతో సవాళ్లను ఎదుర్కోలేని వారు ఈ సీఎన్జీ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. పైగా ఈ సీఎన్జీ వాహనాలు డ్యూయల్ ఫ్యూయల్ వేరియంట్లుగా మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే సీఎన్జీతో పాటు పెట్రోల్ తో కూడా కారు నడుస్తుంది. అంటే కారులో ఉండే ఒకే ఇంజిన్ అటు సీఎన్జీతో పాటు పెట్రోల్ కూడా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తరహా కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ సీఎన్జీ వేరియంట్లో కార్లు, బస్సులు, ఆటోలు ఎక్కువగా మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకూ ద్విచక్ర వాహనాల్లో సీఎన్జీ వేరియంట్ ఏదీ లేదు. అయితే రానున్న కొద్ది రోజుల్లో బజాజ్ కంపెనీ నుంచి ఓ సీఎన్జీ బైక్ రానుందని తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అది కూడా బజాజ్ 110 సీసీ ప్లాటినా బైక్ ఈ సీఎన్జీ వేరియంట్లో రానున్నట్లు చెబుతున్నారు. ఇది కూడా డ్యూయల్ ఫ్యూయల్ వేరియంట్ గానే తీసుకొస్తున్నారు. అంటే సీఎన్జీతో పాటు పెట్రోల్ పై కూడా ఈ బైక్ నడవగలుగుతుంది.

బ్రూజర్ ఈ101 పేరుతో..

బజాజ్ సీఎన్జీ బైక్ ను మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉంది. ఇటీవలి మీడియా నివేదికల ప్రకారం, బజాజ్ సీఎన్జీతో నడిచే 110సీసీ బైక్‌ తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఈ బైక్ ను ప్రస్తుతానికి బ్రూజర్ ఈ101(Bruzer E101) అనే పేరు పెట్టినట్లు చెబుతున్నారు. దీని అభివృద్ధి చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

బజాజ్ లక్ష్యం ఇది..

సంవత్సరానికి 1-1.2 లక్షల సీఎన్జీ బైకులను ఉత్పత్తి చేయడాన్ని బజాజ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు మీడియా రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో దానిని ఏడాదికి రెండు లక్షల యూనిట్లు తయారు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ 110సీసీ సీఎన్జీ బైక్ కు సంబంధించిన కొన్ని నమూనాలు ఇప్పటికే రూపొందించారని సమాచారం. రానున్న 6-12 నెలల్లో అమ్మకానికి వస్తుందని అంచనా వేస్తున్నారు, బ్రూజర్ ఈ101 సీఎన్జీ బైక్ లాంచ్ అయిన తర్వాత ‘ప్లాటినా’ నేమ్‌ట్యాగ్‌ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది బజాజ్‌కి మాస్ మార్కెట్ అందిస్తుందని భావిస్తోంది. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో అంతకు మించి అవసరమైన రీచ్‌ని అందిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతానికి, ఈ సీఎన్జీ బైక్‌కు సంబంధించి ఎటువంటి వివరాలూ లేవు. రాబోయే ఒకటి రెండు నెలల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పొందే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..