Exchange Rs 2,000 Notes: రూ.2,000 నోట్లను చాలా ఈజీగా మార్చుకునే విధానం ఇదే.. పూర్తి వివరాలు..
రూ.2 వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. తమ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసి వాటికి సమానమైన విలువ కలిగిన ఇతర నోట్లను తీసుకోచవచ్చని తెలిపింది. మే 23, 2023 నుంచి ఏ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి అయినా ఈ నోట్లను మార్చుకోవచ్చు.
దేశంలో అందుబాటులో ఉన్న కరెన్సీలో పెద్ద నోటు రూ. 2,000 నోటు. 2016లో చలామణిలోకి వచ్చింది. డీమానిటైజేషన్ లో భాగంగా రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ఈ పెద్ద నోటును రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్బీఐ ఓ సంచనలన నిర్ణయం తీసుకుంది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ పెద్ద నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నోట్లను ఇవ్వటం ఆపేయాలని దేశంలోని బ్యాంకులకు సూచనలు చేసింది. అయితే, ఈ పెద్ద నోట్లు చెల్లుతాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
మే 23 నుంచి మార్చుకునేందుకు అవకాశం..
రూ.2 వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. తమ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసి వాటికి సమానమైన విలువ కలిగిన ఇతర నోట్లను తీసుకోచవచ్చని తెలిపింది. మే 23, 2023 నుంచి ఏ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి అయినా ఈ నోట్లను మార్చుకోవచ్చు. అలాగే దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు వివరించింది. ఒకవేళ, సెప్టెంబరు 30 లోపు ఆ పని చేయలేకపోతే ? ఆ తరువాత ఆ నోట్లను మార్చుకోవాలంటే బ్యాంకుల్లో కాకుండా ఆర్బీఐ రీజినల్ ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.
ఒక రోజుకి ఎన్నంటే..
అయితే, బ్యాంక్ సేవలకు అంతరాయం కలగకుండా ఒకసారి రూ.20,000 వరకు మాత్రమే.. అంటే కేవలం పది నోట్లు మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అదే డిపాజిట్ అయితే ఎంతైన చేసుకోవచ్చు. డిపాజిట్ చేసేందుకు పరిమితి లేదు.
బ్యాంకులో ఎలా మార్చుకోవాలంటే..
- మే 23 నుంచి బ్యాంకుకు వెళ్లి రూ. 2000 నోట్ల ను మార్చుకోవచ్చు. అందుకోసం మీ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లాలి.
- అక్కడ ఎక్స్ ఛేంజ్ రిక్వెస్ట్ స్లిప్ అని ఉంటుంది. దానిలో అడిగిన ఐడెంటిఫికేషన్ వివరాలు రాసి పూర్తి చేయాలి. ఆ తర్వాత రూ. 2000నోట్ల వివరాలు పొందుపరచాలి. ఎన్ని ఇస్తున్నారు ఏంటి అన్నది రాయాలి.
- ఆ తర్వాత ఆ రిక్వెస్ట్ స్లిప్ ను సబ్మిట్ చేసి రూ. 2000నోట్లకు బదులు ఇతర నోట్లు తీసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..