7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ పెంపు! ఏయే రాష్ట్రాలు ఎంత మేర పెంచాయో తెలుసా?

కొన్ని నెలల్లో వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెంపుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు వార్తల తర్వాత అనేక రాష్ట్రాలు ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచాయి. గతంలో 38 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు 42 శాతానికి కేంద్ర..

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ పెంపు! ఏయే రాష్ట్రాలు ఎంత మేర పెంచాయో తెలుసా?
Da Hike
Follow us

|

Updated on: May 21, 2023 | 5:27 PM

కొన్ని నెలల్లో వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెంపుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు వార్తల తర్వాత అనేక రాష్ట్రాలు ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచాయి. గతంలో 38 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు 42 శాతానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈ పెంపు 1 జనవరి 2023 నుంచి వర్తిస్తుంది.

డియర్‌నెస్ అలవెన్స్‌ను సంవత్సరానికి రెండుసార్లు పెంచుతారు. అయితే ప్రభుత్వం కూడా పరిస్థితులను బట్టి వాయిదా వేయవచ్చు. ఆరు నెలల్లో డీఏ విడుదలవుతుంది. అంటే మొదటి పెంపు జనవరిలో మరియు రెండవ పెంపు జూలైలో జరుగుతుంది. యూపీ, తమిళనాడు, అస్సాం, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు జనవరి డీఏను పెంచాయి.

తమిళనాడు డీఏ ఎంత పెంచింది:

తమిళనాడు ప్రభుత్వం ఇటీవల డీఏను 4 శాతం పెంచింది. అంటే ఇప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. దీనివల్ల 16 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2023 నుంచి పరిగణించబడతాయి.

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్ ఉద్యోగుల ప్రయోజనాలు:

ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ కూడా పెంచారు. ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 42 శాతం డీఏ ఇస్తున్నారు. ఈ నిర్ణయంతో 16.35 లక్షల మంది ఉద్యోగులు, 11 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

బీహార్‌లో డీఏ పెరిగింది:

బీహార్ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు భారీ బహుమతి ఇస్తూనే డీఏ పెంపును ప్రకటించింది. ఇక్కడ ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచాల్సి ఉంది. ఈ పెంపు వల్ల పెన్షనర్లకు కూడా ప్రయోజనం ఉంటుంది.

హిమాయల్‌, అసోం, రాజస్థాన్‌ ఉద్యోగులకు..

హిమాచల్, అసోం, రాజస్థాన్‌లలో కూడా డియర్‌నెస్ అలవెన్స్ పెరిగింది. హిమాచల్‌లో ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచారు. మరోవైపు, రాజస్థాన్‌లో 4 శాతం డీఏ పెంచారు. అలాగే అస్సాంలో ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు బహుమతిని అందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి