Bank FD: ఇది కదా స్మార్ట్ ప్లానింగ్ అంటే.. నెలనెలా ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టే అవకాశం.. అత్యధిక వడ్డీ కూడా మీ సొంతం..
సాధారణంగా ఎఫ్‌డీ అంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే బజాజ్ ఫైనాన్స్ సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్ ద్వారా స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టవచ్చు. నెలనెలా తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసే వీలుంటుంది.

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యింది. అందరూ తమ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంటారు. ఎందులో పెట్టుబడి పెట్టాలి.. ప్రస్తుతం ఉన్న ఈఎంఐలను ఎలా మెయింటేన్ చేయాలనే విషయాలను బేరీజు వేసుకుంటూ ముందుకెళ్తారు. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన తప్పులు చేయకుండా ఉండాలంటే ఈ సమీక్ష ప్రతి కుటుంబంలోనూ జరగాలి. అదే సమయంలో సురక్షిత పెట్టుబడి పథకాల గురించి అన్వేషించాలి. మార్కెట్ ఒడిదొడుకులకు లోనుకాని, అధిక వడ్డీ వచ్చే పోర్ట్ ఫోలియోను ఎంచుకొని అందులో పెట్టుబడులు పెడితే రాబడులకు భరోసా ఉంటుంది. అలాంటి పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ముందు వరుసలో ఉంటుంది. స్థిరమైన వడ్డీ రేటులో పాటు తక్కువ రిస్క్ ఉన్న ఈ పథకం మీకు బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీ వల్ల ఖాతాదారులకు ఒనగూరే ప్రయోజనాలు ఏంటి? ఈ బ్యాంకులో ఎఫ్‌డీలపై అత్యధిక శాతం వడ్డీ వస్తుందో తెలుసుకుందాం..
ఎఫ్‌డీల వల్ల ప్రయోజనాలు ఇవి..
- ఎఫ్‌డీ రేట్లు మార్కెట్ హెచ్చుతగ్గులను అనుసరించవు కాబట్టి, మీ పెట్టుబడికి పూర్తి భరోసా ఉంటుంది. మీరు ఖాతా ప్రారంభించినప్పుడు ఎంత వడ్డీ ఉందో అంతే వడ్డీతో మెచ్యూరిటీ సమయంలోనూ పొందుతారు.
- స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పెట్టుబడిదారులు తమ డబ్బును ఎఫ్‌డీల కంటే వేగంగా పెంచుకోవచ్చు. అయితే అవి మార్కెట్ రిస్క్‌లకు లోనవుతాయి. ఆ రాబడులపై కచ్చితమైన హామీ ఉండదు. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్ లో ఆ పరిస్థితి ఉండదు.
- వ్యక్తులు సాధారణ వ్యవధిలో సంపాదించిన వడ్డీని పొందడానికి ఎఫ్‌డీలలో నాన్-క్యుములేటివ్ చెల్లింపు ఎంపికలను ఎంచుకోవచ్చు. ఇది నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా ఉంటుంది. ఈ నాన్-క్యుములేటివ్ పేఅవుట్ ఖాతాదారుల చిన్న ఖర్చులకు ఉపకరిస్తుంది.
- ఇటీవల కాలంలో రెపో రేటు గణనీయంగా పెరుగుతోంది. దీని కనుగుణంగా ఎఫ్‌డీ రేట్లను ఆర్థిక సంస్థలు పెంచుతాయి. ఇది ఆర్థికంగా మేలు చేస్తుంది.
అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకు ఏది?
అన్ని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో మీరు ఎఫ్‌డీ ఖాతాను ప్రారంభించవచ్చు. అన్నింట్లోనూ 7 శాతంపైనే వడ్డీ రేటు ఉంటుంది. అయితే ప్రైవేటు బ్యాంకయిన బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీలపై అత్యధిక శాతం వడ్డీని అందిస్తుంది. 44 నెలల కాలవ్యవధికి 8.20% వరకు వడ్డీని అందిస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్..
బజాజ్ ఫైనాన్స్‌లో కస్టమర్‌లు 12నెలల నుంచి 60 నెలల కాలానికి రూ.15,000 నుంచి రూ.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం, వార్షిక వడ్డీ రేటు 7.40% నుంచి ప్రారంభమవుతుంది. మెచ్యూరిటీ కాలాన్ని బట్టి 8.20% వరకు పెరుగుతుంది. 15, 18, 22, 30, 33, 44 నెలల కాలాల్లో ఏదో ఒకటి మెచ్యూరిటీ వ్యవధిగాపెట్టుకోవాల్సి ఉంటుంది.
నెలనెలా కూడా డిపాజిట్ చేయొచ్చు..
సాధారణంగా ఎఫ్‌డీ అంటే ఒకేసారి మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే బజాజ్ ఫైనాన్స్ సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్ ద్వారా స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టవచ్చు. నెలనెలా తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసే వీలుంటుంది. తక్కువ మొత్తంలో ఆదాయం ఉన్న వ్యక్తులకు ఇది బాగా ఉపకరిస్తుంది. వారు ప్రతి నెలా రూ.5,000 కనీసం 12 నెలల పాటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని బ్యాంకు వారు ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా తీసుకుంటారు. టెన్యూర్ పూర్తయిన తర్వాత మొత్తం బ్యాలెన్స్‌ని ఒకేసారి డ్రా చేసుకోవచ్చు. మంత్లీ మెచ్యూరిటీ స్కీమ్‌ని ఎంచుకోవడం ద్వారా ఎఫ్‌డీ ప్రయోజనాన్ని విడిగా పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..