IDBI FD: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకొనే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను భారీగా పెంచిన బ్యాంకు.. వివరాలు తెలుసుకోండి..
ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐడీబీఐ కూడా తన ఎఫ్‌డీ రేట్లను సవరించి కొత్త పథకాన్ని ప్రకటించింది. ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ (ఎఫ్‌డీ) పేరిట దీనిని విడుదల చేసింది. ఇది 2023, ఏప్రిల్ 1 నుంచి రిటైల్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

కొత్త ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు వినియోగదారులకు ఆకర్షించేందుకు సరికొత్త పథకాలతో ముందుకువస్తున్నారు. సవరించిన వడ్డీరేట్లతో వినియోగదారులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ)లపై అధిక వడ్డీ రేట్లతో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఐడీబీఐ కూడా తన ఎఫ్‌డీ రేట్లను సవరించి కొత్త పథకాన్ని ప్రకటించింది. ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ (ఎఫ్‌డీ) పేరిట దీనిని విడుదల చేసింది. ఇది 2023, ఏప్రిల్ 1 నుంచి రిటైల్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. వృద్ధులకు, సాధారణ పౌరులకు విడివిడిగా వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ఉన్న దానికి కన్నా ఎక్కువగా..
రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఐడీబీఐ సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2023 నుండి అమలులో ఉంటాయి. ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లు సాధారణ ప్రజలకు 3.00% నుండి 6.25% , సీనియర్ సిటిజన్లకు 3.50% నుండి 6.75% వరకు అందిస్తోంది. అదే ఇప్పుడు ప్రకటించిన అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ పథకంలో వృద్ధులకు 7.65%, సాధారణ ప్రజలకు 7.15% వడ్డీని అందిస్తోంది.
కొత్త వడ్డీ రేట్లు ఇలా..
బ్యాంక్ ఇప్పుడు 7 నుండి 30 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.00% వడ్డీ రేటును ఇస్తోంది. అలాగే 31 నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.35% వడ్డీ రేటును అందిస్తోంది. 46 నుండి 90 రోజుల పాటు ఉంచిన డిపాజిట్లపై 4.25%, 91 నుండి 6 నెలల వరకు ఉంచిన డిపాజిట్లపై 4.75%. 6 నెలల 1 రోజు నుండి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.50% వడ్డీ లభిస్తుంది. అలాగే 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలలో (444 రోజులు మినహా) మెచ్యూర్ అయిన వాటికి 6.75% వడ్డీ రేటు లభిస్తుంది. 2 నుండి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50% వడ్డీ రేటును ఇస్తోంది. ఇక 3 నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.25% వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే 5 సంవత్సరాల పన్ను సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, బ్యాంక్ సాధారణ ప్రజలకు 6.25% , సీనియర్ సిటిజన్‌లకు 6.75% వడ్డీ రేటును అందిస్తోంది.
రెన్యూవల్, కొత్త ఖాతాలకు మాత్రమే.. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఎఫ్ డీ ఖాతా రెన్యూవల్ చేసే వారికి లేదా కొత్త ఖాతా ప్రారంభించే వారికి మాత్రమే వర్తిస్తాయని బ్యాంకు ప్రకటించింది.
ప్రీ మెచ్యూర్ విత్ డ్రాల్స్.. మెచ్యూరిటీ సమయానికన్నా ముందుగానే అకౌంట్ క్లోజ్ చేయాలనుకొనే వారికి బ్యాంకు కేవలం 1శాతం మాత్రమే పెనాల్టీ విధిస్తుంది. అయితే బ్యాంకు స్వీప్-ఇన్‌ల ద్వారా ఉపసంహరణ, పాక్షిక ఉపసంహరణకు అవకాశం కల్పిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..