Business Idea: రూ. లక్షతో బిజినెస్ స్టార్ట్ చేయండి.. నెలకు రూ. 75వేలు సంపాదించండి.. పూర్తి వివరాలు ఇవి..
ఫ్లిప్‌కార్ట్ డెలివరీ భాగస్వామిగా మీరు ఎంత లాభాన్ని పొందవచ్చో తెలియాలంటే మీరు ఫ్రాంచైజ్ తీసుకున్న ప్రాంతం, ఆర్డర్ల సంఖ్య తెలియాలి. వాటిని బట్టి మీకొచ్చే లాభం మారుతుంటుంది. మీరు పెద్ద సంఖ్యలో ఆర్డర్‌లను పూర్తి చేయగలిగితే, మీరు గౌరవప్రదమైన లాభాన్ని పొందవచ్చు.
మీరు మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా ఉండాలని భావిస్తున్నారా? మీరు చేసే బిజినెస్ తో మీకు కాస్త ఇతర ఆదాయంగా ఉండాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇదే బెస్ట్ ఆప్షన్. అదేంటంటే ఫ్లిప్ కార్ట్ ఫ్రాంచైజ్. ఇటీవల కాలంలో ఆన్ లైన్ షాపింగ్ కు డిమాండ్ పెరిగింది. అందరూ ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫారంలలోనే అన్ని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేస్తున్న వారికి హోం డెలివరీలు కంపెనీలు అందిస్తుంటాయి. అందుకోసం ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఫ్రాంచైజీలను తీసుకొంటాయి. వాటికి కాంట్రాక్ట్ ఇస్తాయి. ఈ ఫ్రాంచైజీలను తీసుకోవడం ద్వారా మీరు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏంటి ఈ ఫ్రాంచైజీ స్కీమ్..
ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు వినియోగదారులు తమ వద్ద కొనుగోలు చేసిన వస్తువులను వారికి డెలివరీ అందించేందుకు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తాయి. ఫ్రాంచైజీలుగా కాంట్రాక్ట్ లు ఇస్తాయి. వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులను ఫ్రాంచైజీ తీసుకున్న వారు డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఏం చేయాలి..
ఫ్లిప్‌కార్ట్ డెలివరీ భాగస్వామి కావడానికి మీరు తప్పనిసరిగా కొన్ని షరతులకు లోబడాలి. మొదటగా మీ సొంత కారు కలిగి ఉండాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అలాగే మీరు డెలివరీ తేదీలకు తప్పనిసరిగా డెలీవరీలు ఇస్తానని హామీ ఇవ్వగలగాలి. తప్పనిసరిగా 500 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలి.
పెట్టుబడి వివరాలు..
ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఫ్రాంచైజీ ధర ప్రాంతాన్ని బట్టి, మీరు తీసుకొనే ఆర్డర్ లను బట్టి మారుతుంటుంది. అయితే, కనీసం రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య బడ్జెట్ అయితే ఫ్లిప్ కార్ట్ ఫ్రాంచైజీ తీసుకోడానికి అవసరమవుతుంది.
లాభాలు ఎలా ఉంటాయి..
ఫ్లిప్‌కార్ట్ డెలివరీ భాగస్వామిగా మీరు ఎంత లాభాన్ని పొందవచ్చో తెలియాలంటే మీరు ఫ్రాంచైజ్ తీసుకున్న ప్రాంతం, ఆర్డర్ల సంఖ్య తెలియాలి. వాటిని బట్టి మీకొచ్చే లాభం మారుతుంటుంది. మీరు పెద్ద సంఖ్యలో ఆర్డర్‌లను పూర్తి చేయగలిగితే, మీరు గౌరవప్రదమైన లాభాన్ని పొందవచ్చు. మీరు చేసే ప్రతి డెలివరీకి, మీకు కమీషన్ చెల్లిస్తారు. డెలివరీ స్థానం, వస్తువుల స్వభావాన్ని బట్టి కమీషన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇలా సంవత్సరానికి రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లాభం పొందవచ్చు.
అర్హతలు ఇవి..
ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఫ్రాంచైజీకి దరఖాస్తు చేయడానికి మీకు కనీసం 18 ఏళ్లు ఉండాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అదనంగా, మీరు తప్పనిసరిగా డెలివరీ కచ్చితమైన తేదీలకు హామీ ఇవ్వాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..