AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola New e-Scooter: ఓలా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచింగ్ ఎప్పుడంటే..

ఓలా ఎలక్ట్రిక్​ నుంచి మరో కొత్త స్కూటర్​ వస్తే, సంస్థ పోర్ట్​ఫోలియో మరింత శక్తివంతంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​లో ఓలాకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే.

Ola New e-Scooter: ఓలా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచింగ్ ఎప్పుడంటే..
Ola Electric
Madhu
|

Updated on: Jun 20, 2023 | 6:00 PM

Share

మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఓలా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఇప్పటి వరకూ అత్యధిక విక్రయాలు జరిపిన సంస్థగా నిలిచింది. నంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతోంది. అత్యాధునిక ఫీచర్లు.. ఆకర్షణీయమైన ఆకృతిల్లో పలు మోడళ్లను ఆవిష్కరించింది. ఇదే క్రమంలో మరో కొత్త మోడల్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్​ సీఈఓ భవిష్​ అగర్వాల్​ ఓ ట్వీట్ చేశారు. కొత్త మోడల్ కు సంబంధించిన హెడ్ లైట్లతో ఓ చిత్రాన్ని ఉంచారు. 2023, జులైలో కొత్త ప్రాడక్ట్​ లాంచ్​ ఉంటుంది అన్నట్టుగా ఆయన ట్వీట్​ చేశారు.

భవిష్ అగర్వాల్ పెట్టిన ట్వీట్ ఇది..

‘జులైలో జరిగే ఈవెంట్​లో ఓ కొత్త ప్రాడక్ట్​ను ప్రకటిస్తాం. ఈ ఈవెట్​ను #endICEAge షో అని పిలుస్తున్నాం. ఇది పార్ట్​ 1 మాత్రమే. ఈ షోతో స్కూటర్లలో ఐసీఈ ఏజ్​ స్కూటర్లకు ముగింపు పడుతుంది! ఎస్​1 ప్రో, ఎస్​ 1 ఎయిర్​తో పాటు మరెన్నో..,’ అని చికట్లో వెలుగుతున్న ఓ స్కూటర్ హెడ్ ల్యాంప్ చిత్రాన్ని జోడిస్తూ భవిష్​ అగర్వాల్​ ట్వీట్​ చేశారు.

ఐసీఈ అంటే.. ఇంటర్నల్​ కంబషన్​ ఇంజిన్​తో కూడిన స్కూటర్లు. వీటిని తగ్గించేందుకు ప్రపంచం కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్​ అగర్వాల్​ ట్వీట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. నెటిజనులు దీనిపై విపరీతంగా స్పందిస్తున్నారు. కొందరూ పాజిటివ్ స్పందస్తుండగా.. మరికొందరు సర్వీస్ సరిగా లేదని అది చూసుకోవాలని సూచిస్తూ రీట్వీట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొత్త ఉత్పత్తి ఎలా ఉండొచ్చు..

అగర్వాల్ ప్రస్తావిస్తున్న కొత్త ఉత్పత్తి గురించి పెద్దగా తెలియనప్పటికీ, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విండ్‌షీల్డ్‌ను కలిగి ఉంటుందని చిత్రాలు చూపిస్తున్నాయి, ఇది సరికొత్త టూరర్ స్కూటర్ లేదా బహుశా దాని ప్రస్తుత మోడల్‌లో టూరర్ వేరియంట్ కావచ్చునని అంచనా. కంపెనీ తన అత్యంత సరసమైన ఉత్పత్తి ఓలా ఎస్1 ఎయిర్ కోసం కొత్త ఉపకరణాల సెట్‌ను తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది.

ప్రస్తుతం ఓలా పరిస్థితి ఇది..

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్​ పోర్ట్​ఫోలియోలో.. ఓలా ఎస్​1, ఓలా ఎస్​1 ప్రో, ఓలా ఎస్​1 ఎయిర్​ వంటి ప్రాడక్ట్స్​ ఉన్నాయి. వీటి ఎక్స్​షోరూం ధరలు వరుసగా రూ. 1.30లక్షలు, రూ. 1.40లక్షలు, రూ. 99,999గా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్​ నుంచి మరో కొత్త స్కూటర్​ వస్తే, సంస్థ పోర్ట్​ఫోలియో మరింత శక్తివంతంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​లో ఓలాకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి