Loan from LIC policies: ఎల్ఐసీ పాలసీల నుంచి రుణం కావాలా.. ఇలా అయితే ఈజీగా పొందొచ్చు..
సాధారణంగా ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే అది మెచ్యూర్ అయ్యాక డబ్బులు వస్తాయి. లేదా అనుకోకుండా యజమాని మరణిస్తే కుటుంబ సభ్యులకు బీమా అందజేస్తారు. కానీ పాలనీ కడుతుండగానే మనం దానిపై రుణం పొందే అవకాశం కూడా ఉంది. పాలసీ సరెండర్ విలువను లెక్కించి మీకు రుణం అందజేస్తారు. అత్యవసర సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి పాలసీదారులకు ఈ అవకాశం ఉంది.

జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక అవసరం. ముఖ్యంగా పొదుపు అలవాటు చేసుకుని, ఆ డబ్బులను భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలి. మనతో పాటు మన కుటుంబానికి భద్రత కల్పించాలి. అందుకోసం ఎక్కువగా జీవిత బీమా పాలసీలు కడుతుంటాం. వాటిలో అందరికీ బాగా తెలిసిన పేరు లైఫ్ ఇన్స్య్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ). దీని ద్వారా అనేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ వారి అవసరాలకు తగిన విధంగా రూపొందించారు.
పాలసీలపై రుణం..
సాధారణంగా ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే అది మెచ్యూర్ అయ్యాక డబ్బులు వస్తాయి. లేదా అనుకోకుండా యజమాని మరణిస్తే కుటుంబ సభ్యులకు బీమా అందజేస్తారు. కానీ పాలనీ కడుతుండగానే మనం దానిపై రుణం పొందే అవకాశం కూడా ఉంది. పాలసీ సరెండర్ విలువను లెక్కించి మీకు రుణం అందజేస్తారు. అత్యవసర సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి పాలసీదారులకు ఈ అవకాశం ఉంది.
నిబంధనలు..
రుణం పొందాలంటే అర్హతా ప్రమాణాలు, డాక్యుమెంటేషన్ వివరాలు, తిరిగి చెల్లించే పద్ధతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. తవడ్డీ రేట్లు, రీపేమెంట్ షెడ్యూల్, పాలసీ ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి ఎల్ఐసీ అధికారులు, ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది. పాలసీపై రుణం పొందటానికి అవసరమైన నిబంధనలను తెలుసుకుందాం.
అర్హత: ఎల్ఐసీ అందించే అన్ని పాలసీల నుంచి రుణం పొందే అవకాశం ఉండదు. ముందుగా మీ డాక్యుమెంట్ ను పరిశీలించాలి. లేకపోతే నేరుగా ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలి.
లోన్ మొత్తం: మీ పాలసీ నుంచి మీకు ఎంత రుణం మంజూరు చేస్తారో ముందుగా తెలుసుకోవాలి. సాధారణంగా పాలసీ సరెండర్ విలువ ఆధారంగా ఉంటుంది. అయితే ఇది కూడా పాలసీ రకం, వ్యవధిని బట్టి మారుతుంది.
దరఖాస్తు: లోన్ అప్లికేషన్ ఫారం కోసం సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించండి. లేకపోతే ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. దరఖాస్తు ఫారాన్ని జాగ్రత్తగా పూర్తి చేయడం. అవసరమైన అన్ని వివరాలను తెలియజేయండి.
అవసరమైన పత్రాలు: లోన్ అప్లికేషన్ తో పాటు అందజేయడానికి అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. పాలసీ డాక్యుమెంట్, గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్), చిరునామా, ఇంకా ఎల్ఐసీ సంస్థ అడిగి ఇతర పత్రాలను కూడా రెడీ చేసుకోవాలి.
ప్రాసెసింగ్: అవసరమైన పత్రాలను జతచేసిన రుణ దరఖాస్తును సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్ పోర్టల్ లో సమర్పించండి. వాటిని సంస్థ పరిశీలించి తర్వాత, అన్ని సక్రమంగా ఉంటే మీ దరఖాస్తు మందుకు కదులుతుంది.
లోన్ ఆమోదం: మీ దరఖాస్తును పరిశీలించి, ఆమోదించిన అనంతరం రుణాన్ని మీకు అందజేస్తారు. పాలసీ సరెండర్ విలువ నుంచి లోన్ మొత్తం తీసివేస్తారు. అలాగే ఇచ్చిన రుణంపై వడ్డీ కూడా విధిస్తారు.
తిరిగి చెల్లింపు: రుణం తీసుకున్న తర్వాత ఎల్ఐసీ నిబంధనలకు అనుగుణంగా వడ్డీతో పాటు రుణాన్ని తిరిగి చెల్లించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








