Online Fraud: నకిలీ మెసేజ్‌లను ఇలా గుర్తించండి.. ఆన్‌లైన్ మోసాల బారిన పడకండి
ఇందుకు సంబంధించి ఓ ట్వీట్‌ను చేశారు. ఇందులో భాగంగా రెండు ఫొటోలను పోస్ట్ చేసిన అధికారులు ఫేక్ మెసేజ్ ఎలా ఉంటుందో వివరించారు. మనకు ఫోన్‌కు వచ్చే టెక్ట్స్ మెసేజ్‌లో ఉండే అక్షరాల స్టైల్ ఆధారంగా వచ్చింది అసలు మెసేజా, నకిలీ మెసేజీ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంక్ పేరు ఉండే యూఆర్‌ఎల్‌ను గమనించి నకిలీ మెసేజ్‌ను గుర్తించవచ్చు....

ఇంటర్‌నెట్ వినియోగం ఎంతలా పెరిగిందో అదే స్థాయిలో నేరాలు సైతం పెరిగిపోయాయి. రకరకాల మార్గాల్లో సైబర్ నేరస్థులు డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి మోసాల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ పేరుతో వచ్చే మెసేజ్‌లు కూడా ఒకటి. అయితే ఇదే విషయమై తాజాగా ఢిల్లీ పోలీసులు ప్రజలను అలర్ట్ చేశారు. మొబైల్ ఫోన్‌కు వచ్చే మెసేజ్‌ల విషయంలో మోసపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు.
ఇందుకు సంబంధించి ఓ ట్వీట్‌ను చేశారు. ఇందులో భాగంగా రెండు ఫొటోలను పోస్ట్ చేసిన అధికారులు ఫేక్ మెసేజ్ ఎలా ఉంటుందో వివరించారు. మనకు ఫోన్‌కు వచ్చే టెక్ట్స్ మెసేజ్‌లో ఉండే అక్షరాల స్టైల్ ఆధారంగా వచ్చింది అసలు మెసేజా, నకిలీ మెసేజీ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంక్ పేరు ఉండే యూఆర్‌ఎల్‌ను గమనించి నకిలీ మెసేజ్‌ను గుర్తించవచ్చు. మోసపూరిత మెసేజ్‌లో ఉండే యూఆర్‌ఎల్ లింక్‌లో అక్షరాలు సిరిలిక్ స్క్రిప్ట్‌లో ఉంటాయి.
Fraudsters may use Cyrillic script for phishing attacks, always check URL’s carefully before clicking.#DelhiPoliceCares#CyberSafety pic.twitter.com/axPngNkwJZ
— Delhi Police (@DelhiPolice) April 4, 2024
పైన ఫొటోలో కనిపిస్తున్నట్లు యూఆర్‌ఎల్‌లో తేడాను గమనించవచ్చు. ఒకవేళ యూఆర్‌ఎల్‌లో తేడా కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ లింక్‌ను క్లిక్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున ఫేక్ లింక్‌ను క్లిక్ చేశారో వెంటనే మీ ఫోన్‌లో టూ ఫాక్టర్ అథెంటికేషన్ ఇన్‌స్టాల్ అవుతుంది. అలాగే బ్యాంక్ ఖాతా, పాస్‌వర్డ్ వంటి వాటిని హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి ఫేక్ మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. తెలియని నెంబర్ నుంచి ఎప్పుడు మెసేజ్ వచ్చినా వెంటనే యూఆర్‌ఎల్‌ను క్లిక్ చేయకూడదని చెబుతున్నారు. సదరు బ్యాంకుకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయడం బెటర్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




