AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Renovation Loan: బ్యాంకులు ఇలా కూడా లోన్లు ఇస్తాయా? హోమ్ లోన్‌ అవసరమే లేదుగా! ఇంటి రిన్నోవేషన్‌కు బెస్ట్ ఆప్షన్లు..

మీ ఇల్లు పాతదైపోయిందా? రిన్నోవేషన్ చేయాలని ఆలోచిస్తున్నారా? కానీ అందుకు సరిపడా నిధులు లేక ఆగిపోతున్నారా? అయితే మీకు కొన్ని బెస్ట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అవే హోమ్ రెన్నోవేషన్ లోన్లు. వీటిని ఎలా పొందాలో తెలుసుకుందాం రండి..

Home Renovation Loan: బ్యాంకులు ఇలా కూడా లోన్లు ఇస్తాయా? హోమ్ లోన్‌ అవసరమే లేదుగా! ఇంటి రిన్నోవేషన్‌కు బెస్ట్ ఆప్షన్లు..
Home Loan
Madhu
|

Updated on: May 30, 2023 | 4:15 PM

Share

మీ ఇల్లు పాతదైపోయిందా? రిన్నోవేషన్ చేయాలని ఆలోచిస్తున్నారా? కానీ అందుకు సరిపడా నిధులు లేక ఆగిపోతున్నారా? అయితే మీకు కొన్ని బెస్ట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అవే హోమ్ రెన్నోవేషన్ లోన్లు. వీటిని పలు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) ఆఫర్‌ చేస్తున్నాయి. రెగ్యులర్‌ హోమ్‌ లోన్‌లో భాగంగా లేదా హోమ్‌ లోన్స్‌ కేటగిరీలో ప్రత్యేక ఆఫర్‌గా అందిస్తాయి. ఇప్పటికే హోమ్‌ లోన్‌ తీసుకున్నా, కొత్త కస్టమర్ అయినా హోమ్‌ రెనొవేషన్‌ లోన్ తీసుకునేందుకు ఇబ్బంది ఉండదు. అయితే హోమ్‌ రెనొవేషన్‌ కోసం బ్యాంక్ లోన్‌ తీసుకునే ముందు, మీ ఆర్థిక పరిస్థితి, అవసరాలను అంచనా వేయడం ముఖ్యం. ఇప్పుడు హోమ్ రిన్నేవేషన్ చేసుకునేందుకు అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి తెలుసుకుందాం..

ఎఫ్‌హెచ్ఏ 203(కే) లోన్..

రెనొవేషన్‌ అవసరమైన ఇంటిని కొనుగోలు చేస్తుంటే, లేదా ప్రస్తుత ఇంటికి రీమోడలింగ్ ప్లాన్ చేస్తుంటే, ఎఫ్‌హెచ్ఏ 203(కే) రిహాబిలేషన్‌ లోన్‌ తీసుకోవచ్చు. ఈ లోన్‌ టెన్యూర్‌ 15 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎఫ్‌హెచ్ఏ 203(కే) లోన్‌లు ప్రభుత్వ మద్దతుతో ఉంటాయి కాబట్టి భరోసా ఉంటుంది.

హోమ్ ఈక్విటీ లోన్..

మీ ఇంటికి మరమ్మతులు చేయించడానికి అదే ఇంటిని తాకట్టుగా పెట్టి హోమ్ ఈక్విటీ లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్‌తో ఇంటి రెనొవేషన్‌కి అవసరమైన డబ్బును పొందవచ్చు. ఇతర లోన్‌లతో పోలిస్తే హోమ్ ఈక్విటీ లోన్‌ తక్కువ వడ్డీ రేటుతో వస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధి 5 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ లోన్‌కు అర్హత పొందాలంటే ఇంట్లో ఈక్విటీ ఉండాలి.

ఇవి కూడా చదవండి

హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ (హెచ్ఈఎల్ఓసీ)..

రెనోవేషన్‌ ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సాయం అవసరమైన వారికి హెచ్ఈఎల్ఓసీ ఒక బెస్ట్‌ ఆప్షన్‌. ఇంటిలోని ఈక్విటీ ఆధారంగా ఈ లోన్‌ తీసుకోవచ్చు. అవసరమైన విధంగా ఫండ్స్‌ యాక్సెస్ చేయవచ్చు, తీసుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించవచ్చు. ఈ లోన్‌లు వేరియబుల్ వడ్డీ రేట్లు, 5 నుంచి 25 సంవత్సరాల రీపేమెంట్ వ్యవధితో వస్తాయి.

కన్‌స్ట్రక్షన్‌ లోన్‌..

ముఖ్యమైన నిర్మాణ మార్పులు లేదా చేర్పులతో కూడిన రెనొవేషన్‌ ప్రాజెక్ట్‌ల కోసం కన్‌స్ట్రక్షన్‌ లోన్‌ పొందవచ్చు. ఈ షార్ట్‌ టర్మ్‌ లోన్‌ లేదా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌లో నిధులు దశలవారీగా మంజూరవుతాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత లోన్‌ను మార్టిగేజ్‌గా మార్చుకోవచ్చు లేదా పూర్తిగా చెల్లించవచ్చు. ఈ లోన్లు మార్ట్‌గేజ్‌ లోన్‌ల కంటే ఎక్కువ వడ్డీతో వస్తాయి.

పర్సనల్ లోన్..

సరిపడా మొత్తాన్ని అందించే హోమ్‌ ఈక్విటీ లేకపోతే దానిని కొలేటరల్‌గా ఉపయోగించకూడదని భావిస్తే, రెనొవేషన్‌ కోసం పర్సనల్ లోన్‌ తీసుకోవచ్చు. వీటికి ఎలాంటి ప్రాపర్టీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. హోమ్ ఈక్విటీ లోన్లతో పోలిస్తే సాధారణంగా ఎక్కువ వడ్డీ రేట్లుతో వస్తాయి. పర్సనల్ లోన్‌ అప్లికేషన్‌ ప్రాసెస్‌ వేగంగా ఉంటుంది, రీపేమెంట్ వ్యవధిలో సౌలభ్యాన్ని అందిస్తాయి. టెన్యూర్‌ 1 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..