డిపాజిట్ బీమా హోల్డర్లకు అండగా లక్ష ఇన్సూరెన్స్..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకు సంస్థల్లో కొత్త కొత్త రూల్స్‌ని తీసుకొస్తుంది. అంటే.. ప్రస్తుతం ఒక వ్యక్తి బ్యాంక్‌ ఖాతాలో.. డిపాజిట్ రూపేణా ఎంత ఉన్నా.. లక్ష రూపాయల వరకే బీమా వర్తిస్తుందని తెలిపింది. అంటే.. అనుకోని మీరు డిపాజిట్ చేసిన బ్యాంక్.. దివాలా తీసినా.. మూసివేసినా.. మీకు ముట్టేది మాత్రం లక్షనే అన్నమాట. అయితే.. పీఎంసీ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో.. బీమా వర్తించే మొత్తాన్ని సత్వరం గణనీయంగా పెంచాలని ఎస్‌బీఐ నివేదిక అభిప్రాయ పడింది. […]

డిపాజిట్ బీమా హోల్డర్లకు అండగా లక్ష ఇన్సూరెన్స్..!
Follow us

| Edited By:

Updated on: Oct 09, 2019 | 11:40 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకు సంస్థల్లో కొత్త కొత్త రూల్స్‌ని తీసుకొస్తుంది. అంటే.. ప్రస్తుతం ఒక వ్యక్తి బ్యాంక్‌ ఖాతాలో.. డిపాజిట్ రూపేణా ఎంత ఉన్నా.. లక్ష రూపాయల వరకే బీమా వర్తిస్తుందని తెలిపింది. అంటే.. అనుకోని మీరు డిపాజిట్ చేసిన బ్యాంక్.. దివాలా తీసినా.. మూసివేసినా.. మీకు ముట్టేది మాత్రం లక్షనే అన్నమాట. అయితే.. పీఎంసీ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో.. బీమా వర్తించే మొత్తాన్ని సత్వరం గణనీయంగా పెంచాలని ఎస్‌బీఐ నివేదిక అభిప్రాయ పడింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం పంజాబ్, మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ)పై పలు రకాల నిబంధనలు పెట్టింది. రోజుకు వెయ్యి విత్‌ డ్రా అనే నియామాలు పెట్టింది. దీనికి కారణం అదేనని అర్థమవుతోంది. గ్లోబల్ మేసేజింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఆదేశాలను పాటించని 36 ప్రైవేట్, విదేశీ బ్యాంకులపై ఆర్జీఐ కొరడా ఝలిపించింది. స్విఫ్ట్ కార్యక్రమాల్లో ఆశించినంత వ‌ృద్ధి చూపని కారణంగా 71 కోట్ల జరిమానా విధించింది.

కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 14వేల కోట్ల స్కామ్ జరగడానికి కారణం స్విఫ్ట్ దుర్వినియోగం చేయడమేనని గుర్తించింది ఆర్బీఐ. ఆ క్రమంలో స్విఫ్ట్ బలోపేతం చేయాలని పలు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. వాటిని లక్ష్యపెట్టలేదనే కారణంతో జరిమానా నిర్ణయం తీసుకుంది.

అసలేం జరిగింది:  పీఎంసీపై ఆరు నెలలపాటు షరతులు వర్తింప చేస్తూ.. ఆర్బీఐ గత నెలలో ఆదేశాలిచ్చింది. దివాలా తీసినా.. మూసినా.. ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారినా వెల్లడించకపోవడం వంటి తీవ్రమైన చర్యలకు ఆ బ్యాంక్ నిర్వాహకులు పాల్పడ్డారు. దీంతో.. ఆ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కొత్త రూల్స్‌ని పెట్టింది. మొదట ఓన్లీ వెయ్యి మాత్రమే విత్‌డ్రా చేయాలని చెప్పింది. ఆ తరువాత దాన్ని రూ.25 వేలు చేసింది. అలాగే.. ఎవరైనా కొత్త రుణాలు తీసుకోవాలన్నా.. డిపాజిట్ చేయాలన్నా నిషేధం విధించారు.

ప్రస్తుతం బీమా ఇలావుంది:

ప్రస్తుతం బ్యాంక్ ఇన్సూరెన్స్‌పై ఆర్టీఐ కొత్త రూల్స్‌ని పాస్ చేసింది. అవేంటంటే..!

1. అసలు వడ్డీకి లక్ష రూపాయల బీమాకు క్రెడిట్ గ్యారెంటీ అందజేస్తోంది. 2. బ్యాంక్ లిక్విడేషన్ లేదా.. రద్దయ్యే తేదీకి నాటికి ఉన్న మొత్తంపై బీమా వర్తింపజేస్తుంది. 3. బ్యాంకులో లక్ష లోపు ఉన్నా.. ఆపై ఉన్న సొమ్ముకు కూడా రూ. లక్షనే బీమా అమలు అవుతుంది.

మిగతా వివరాల కోసం పక్కన ఉన్న లింక్‌ను లాగిన్ అవ్వండి (www.dicgc.org.in)

ఒకే బ్యాంకులో చాలా ఖాతాలుంటే..?

ఒకే బ్యాంకులో చాలా ఖాతాలున్నా కూడా ఇదే పద్దతిని అవలంభించాలని ఎస్‌బీఐ బ్యాంక్ అభిప్రాయ పడింది. దీనికి పలు సూచనలు జారీ చేసింది. వ్యక్తిగత డిపాజిటర్ వద్ద ఉన్న అన్ని ఖాతాలలో ఒక లక్షనే బీమా పరిమితి వర్తిస్తుంది. కాబట్టి, మీరు ఒకే బ్యాంకులో ఎక్కువ ఖాతాలున్నా మీరు బీమా చెల్లింపుగా ఒక లక్ష మాత్రమే అందుకుంటారు. అలాగే.. ఇది ఉమ్మడి ఖాతాలకు కూడా.. ఒకే లక్షను ఇన్సూరెన్స్‌గా అందుకుంటారు.

ఒక బ్యాంకు లిక్విడెంట్‌ అయినప్పుడు డిపాజిటర్లు లక్ష బీమాను పొందడానికి అర్హులవుతారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వారికి ఈ మొత్తం అందుతుంది. ఈ సంస్థ మొత్తం పూర్తిగా ఆర్బీఐకి అనుబంధంగా పనిచేస్తోంది. ఈ లక్ష రూపాయల బీమాలో సేవింగ్స్ ఖాతాల నుంచి రావాల్సిన ప్రిన్సిపల్, వడ్డీ బకాయిలు కూడా ఉంటాయి. కేవలం సేవింగ్స్ ఖాతాలే కాదు. కరెంట్ అకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల నుంచి కూడా అందాల్సిన బకాయిలను ఈ బీమా సొమ్ములో చేర్చారు.

మన డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన నిబంధనలను అన్ని కమర్షియల్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు వర్తిస్తాయి. అలాగే.. స్టేట్, సెంట్రల్, అర్బన్, కో ఆపరేటీవ్ బ్యాంకులు, లోకల్ ఏరియల్ బ్యాంకులతో పాటు, గ్రామీణ బ్యాంకులు కూడా ఇందులో భాగం వహిస్తాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్ చెల్లింపులో ఒక బ్యాంకు విఫలమైన పక్షంలో.. ఒక్కోసారి డిపాజిట్ బ్యాంక్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ సంబంధిత బ్యాంకును డీ-రిజిస్టర్ చేస్తోంది. అలాగే.. దాని ఇన్సూరెన్స్ కవరేజీని నిలిపివేస్తుంది. అందువల్లే వివిధ కేటగెరీల కింద.. ఇన్సూర్డ్ బ్యాంకుల లిస్ట్‌ను ఈ కార్పొరేషన్ వెబ్ సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు.

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!