Kalki 2898 AD: స్టేట్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ‘బుజ్జి’.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ వంటి అగ్రతారాగణం ఉన్నారు.. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో.. భారీ బడ్జెట్.. కానీ ఇవేవి జనాలను ఆకర్షించలేదు. కేవలం ఓ కారు ఇప్పుడు భారతీయ సినీ ప్రపంచాన్ని ఊపేస్తోంది. దాని పేరే బుజ్జి. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కీ 2898ఏడీ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇటీవల పరిచయం చేసిన రోబో కారు ఇది. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి చర్చలు. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా బుజ్జి మారిపోయింది.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ వంటి అగ్రతారాగణం ఉన్నారు.. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో.. భారీ బడ్జెట్.. కానీ ఇవేవి జనాలను ఆకర్షించలేదు. కేవలం ఓ కారు ఇప్పుడు భారతీయ సినీ ప్రపంచాన్ని ఊపేస్తోంది. దాని పేరే బుజ్జి. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కీ 2898ఏడీ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇటీవల పరిచయం చేసిన రోబో కారు ఇది. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి చర్చలు. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా బుజ్జి మారిపోయింది.
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్..
కల్కీ 2898ఏడీ సినిమా జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దీనిని సైన్స్ ఫిక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు సోషియో ఫాంటసీ టైప్ లో లెజెండ్ హీరోల పరిచయాలున్నాయి. మొత్తం మీద కల్కీ 2898ఏడీ సినిమాపై హైప్ మామూలుగా లేదు. అయితే వీటన్నంటి కంటే అందరినీ అమితంగా ఆకర్షిస్తున్న మరో అంశం సినిమాలో భైరవ(హీరో ప్రభాస్) వినియోగించే కారు(బుజ్జి). ఇది ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇప్పటికే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా కోసం కోట్ల రూపాయులు వెచ్చింది దీనిని తయారు చేయడం, సాధారణ కార్లకు భిన్నంగా దీని స్వరూపం ఉండటంతో సహజంగా దాని ప్రత్యేకతల కోసం అందరూ వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత బుజ్జి ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్యూచరిస్టిక్ వాహనం..
ఏఐ ఆధారిత కారు ఇది. ఈ ఫ్యూచరిస్టిక్ వాహనాన్ని నిర్మించడానికి సినిమా క్రూతో పాటు స్వదేశీ తయారీదారులు మహీంద్రా, జయం ఆటోమోటివ్ నుంచి సహాయం తీసుకున్నారు. దీని డిజైన్ ను పరిశీలిస్తే.. రెండు కంపెనీలూ బుజ్జిని తమకు సాధ్యమైనంత వాస్తవికంగా నిర్మించడానికి ప్రయత్నించాయి. కారు బరువు 6 టన్నులు, ముందు భాగంలో కస్టమ్-బిల్ట్ 34.4-అంగుళాల హబ్‌లెస్ రిమ్‌లను కలిగి ఉంది. వెనుక భాగం ఆకట్టుకునే సింగిల్ వీల్‌ని అమర్చారు. దీని వలన బుజ్జి ఏ దిశలోనైనా స్వేచ్ఛగా వెళ్లగలుగుతుంది.
పరిమాణం, శక్తి..
తయారీదారులు డ్రైవర్ వైపు ప్రత్యేక పందిరిని కూడా ఉపయోగించారు. ఇది కొన్ని భవిష్యత్ విమానాల వలె కనిపిస్తుంది. మొత్తం పరిమాణం విషయానికి వస్తే, వాహనం 6075 మి.మీ. పొడవు, 2186 మి.మీ. ఎత్తు, 3380 మి.మీ. వెడల్పుతో ఆకట్టుకుంటుంది. కారు బలమైన 47కేడబ్ల్యూ బ్యాటరీ సెటప్‌తో శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 126 బీహెచ్పీ శక్తిని, 9800ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని బరువు ఏకంగా ఆరు టన్నులు ఉంటుంది.
కారు అద్భుతం..
కాగా ఈ కారును ప్రేక్షకులకు ప్రభాస్ సొంతంగా డ్రైవ్ చేస్తూ పరిచయం చేయగా.. ఆ తర్వాత వరుసగా సెలెబ్రిటీలు దానిని డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ హీరో నాగ చైతన్య దీనిని డ్రైవ్ చేసి అద్భుతమని అభివర్ణించారు. ఇక దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్లలో ఈ బుజ్జినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఏకంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు సైతం తమ బుజ్జినీ చూడాలని ఆహ్వానం పంపడం ఇప్పుడు సంచలనంగా మారింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




