HDFC: మీకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉందా? ఇక బాదుడే.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్
HDFC Bank Rule Changes: ఆగస్టు నెల ప్రారంభం కానుంది. 1వ తేదీ నుంచి ఫైనాన్స్‌కు సంబంధించిన పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. ఈ మార్పులలో ఒకటి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లను ప్రభావితం చేయవచ్చు. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు..
HDFC Bank Rule Changes: ఆగస్టు నెల ప్రారంభం కానుంది. 1వ తేదీ నుంచి ఫైనాన్స్‌కు సంబంధించిన పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. ఈ మార్పులలో ఒకటి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లను ప్రభావితం చేయవచ్చు. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ఇప్పుడు థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా చేసే అన్ని అద్దె లావాదేవీలపై మొత్తంలో 1% ఛార్జ్ వసూలు చేయనున్నారు. ఒక్కో లావాదేవీకి గరిష్ట పరిమితి రూ.3,000. PayTM, CRED, MobiKwik వంటి థర్డ్-పార్టీ చెల్లింపు యాప్‌లను ఉపయోగించి అద్దె లావాదేవీలు చేయవచ్చు.
యుటిలిటీ లావాదేవీలపై ఛార్జ్
యుటిలిటీ లావాదేవీల గురించి మాడితే.. రూ.50000 కంటే తక్కువ లావాదేవీలపై అదనపు ఛార్జీలు ఉండవు. అయితే రూ.50000 కంటే ఎక్కువ లావాదేవీలకు 1 శాతం ఛార్జ్ చేయబడుతుంది. ఒక్కో లావాదేవీకి రూ.3000 పరిమితి ఉంది. అయితే బీమా లావాదేవీలు ఈ ఛార్జీల నుండి మినహాయించబడ్డాయి.
ఇంధన లావాదేవీ
ఇంధన లావాదేవీల గురించి మాట్లాడితే, రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలకు 1 శాతం రుసుము వసూలు చేయనున్నారు. దీని కంటే తక్కువ లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అటువంటి లావాదేవీల గరిష్ట పరిమితి ప్రతి లావాదేవీకి రూ.3,000.
విద్యా లావాదేవీపై రుసుము
CRED, PayTM మొదలైన థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే లావాదేవీలకు 1% రుసుము వసూలు చేయనున్నారు. ఒక్కో లావాదేవీకి రూ.3,000 పరిమితి ఉంది. అయితే, అంతర్జాతీయ విద్య చెల్లింపు ఈ రుసుము నుండి మినహాయింపు ఉంది. అదే సమయంలో స్టేట్‌మెంట్ క్రెడిట్ లేదా క్యాష్‌బ్యాక్‌పై రివార్డ్‌లను రీడీమ్ చేసే కస్టమర్‌ల నుండి రూ.50 ఛార్జీ విధిస్తారు.
అదేవిధంగా రివాల్వింగ్ క్రెడిట్ సౌకర్యాలను ఉపయోగించే కస్టమర్లకు నెలకు 3.75 శాతం వసూలు చేస్తారు. లావాదేవీ జరిగిన తేదీ నుండి బకాయి మొత్తం పూర్తిగా చెల్లించే వరకు ఇది వర్తిస్తుంది.
ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజు
ఏదైనా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లో సులభమైన ఈఎంఐ ఎంపికను పొందేందుకు రూ.299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాలి. ఇది కాకుండా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్‌ల నిబంధనలను మార్చింది.
ఇది కూడా చదవండి: Amazon: అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. 80 శాతం డిస్కౌంట్.. ఎప్పుడో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి