బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆ సర్వీసులకు అంతరాయం.. నెట్ బ్యాంకింగ్ వాడాలని సూచించిన హెచ్డీఎఫ్సీ..
ప్రైవేట్ రంగానికి చెందిన దేశీయ దిగ్గజ బ్యాంకులలో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. మంగళవారం బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగింది.
ప్రైవేట్ రంగానికి చెందిన దేశీయ దిగ్గజ బ్యాంకులలో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. మంగళవారం బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగింది. బ్యాంక్ సర్వీసులకు అంతరాయం కలిగిందని.. వాటిని పరిష్కరిస్తామని.. ఆలోగా.. నెట్ బ్యాంకింగ్ ఉపయోగించాలని బ్యాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
“మొబైల్ బ్యాంకింగ్ యాప్‌కు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. త్వరలోనే వాటిని క్లియర్ చేసి.. అప్ డేట్ చేస్తాము” అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అధికారి ట్వీట్ చేశారు.
ట్వీట్..
We are experiencing some issues on the MobileBanking App. We are looking into this on priority and will update shortly. Customers are requested to please use NetBanking to complete their transaction. Regret the inconvenience caused. Thank you.@HDFCBank_Cares @HDFCBankNews
— Rajiv Banerjee (@RajivBanrjee) June 15, 2021
ఆ తర్వాత ఒక గంట తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీసులలో తలెత్తిన సమస్యలు పరిష్కరించబడ్డాయి. అలాగే వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ కూడా ఉపయోగించుకోవచ్చని.. ఇది ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ ద్వారా బ్రౌజర్ ల నుంచి యాక్సెస్ చేయబడుతుంది అని మరోసారి ట్వీ్ట్ చేసింది.
ట్వీట్..
Please note the issues around mobile banking app is now resolved. Customers can now use NetBanking and Mobile Banking app for transactions. We regret the inconvenience and thank you for your patience.@HDFCBank_Cares @HDFCBankNews
— Rajiv Banerjee (@RajivBanrjee) June 15, 2021
అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత రెండు సంవత్సరాలలో చాలా సమస్యలను ఎదుర్కోంది. ఇది వరకు కూడా చాలా సార్లు బ్యాంక్ కస్టమర్లు ఇలాంటి సౌకర్యం కలిగింది. 2018 నవంబర్ లో మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలలో అంతరాయం కలిగింది. అలాగే 2019 డిసెంబర్ లో ప్రైవేట్ రంగ రుణదాతల నెట్ బ్యాంకింగ్ సేవలలో సమస్యలు తలెత్తాయి. ఇక గతేడాది నవంబర్ లో కొత్త క్రెడిట్ జారీ చేయడంలో అంతరాయం ఏర్పడింది. అయితే ఇలా ప్రతిసారీ సమస్యలు తలెత్తడంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. హెచ్‌డీఎఫ్‌సీలో కొన్ని లోపాలు ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ సర్వీసులను మరింత విస్తరించే ముందు బ్యాంక్ తన ఐటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గతంలోనే వివరించారు.