AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‏న్యూస్.. మూడు కొత్త లోన్ స్కీమ్స్ ప్రకటించిన బ్యాంక్.. వారికి బెనిఫిట్..

దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయానికి ఎంత మంది బలయ్యారు. ఈ క్రమంలోనే బ్యాంకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడమే కాకుండా..

ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‏న్యూస్.. మూడు కొత్త లోన్ స్కీమ్స్ ప్రకటించిన బ్యాంక్.. వారికి బెనిఫిట్..
Canara Bank
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2021 | 7:10 PM

Share

దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయానికి ఎంత మంది బలయ్యారు. ఈ క్రమంలోనే బ్యాంకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడమే కాకుండా.. పలు కొత్త స్కీమ్స్ తోపాటు.. కొన్ని రూల్స్ కూడా మార్చాయి. తాజాగా కెనరా బ్యాంక్ తన కస్టమర్ల కోసం మూడు కొత్త లోన్ పథకాలను ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు ఆరోగ్య సంరక్షణ, బిజినెస్, వ్యక్తిగత రుణాలను అందిస్తుంది.

కెనరా వ్యక్తిగత లోన్ స్కీమ్.. కరోనా బారిన పడినవారి కోసం తక్షణ ఆర్థిక సహాయంగా.. బ్యాంక్ వీరికి రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్స్ అందిస్తుంది. ఈ పథకం ఆరు నెలల వరకు తాత్కాలిక నిషేదాన్ని అందిస్తుంది. ఇది 30 సెప్టెంబర్ 2021 వరకు చెల్లుతుంది.

కెనరా ఆరోగ్య రుణ పథకం.. ఆసుపత్రులు, నర్సింగ్, వైద్యులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, పాథాలజీ ప్రయోగశాలలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల సేవలో ఉన్నవారికి రూ.10 లక్షల నుంచి రూ. 50 కోట్ల రుణాలను అందిస్తుంది. ప్రభుత్వ రుణదాత వడ్డీ రేటుతో లోన్ 10 సంవత్సరాల నుంచి 18 నెలల వరకు నిషేదించబడుతుంది. కెనరా థెరపీ 2022 మార్చి 22 వరకు చెల్లుతుంది.

కెనరా జీవన్ రేఖ ఆరోగ్య వ్యాపార రుణ పథకం… అందులో కెనరా బ్యాంక్ రూ.2 కోట్ల వరకు లోన్ తక్కువ వడ్డీ రేటు కోసం ఆసుపత్రులు, నర్సింగ్ సిబ్బందికి బెనిఫిట్ ఉంటుంది. ఈ లోన్ కు ప్రాసెసింగ్ ఫీజు ఉండదని బ్యాంక్ తెలిపింది. మైక్రో, చిన్న, మీడియం ఎంటర్ ప్రైజెస్ ఎటువంటి భద్రత లేదు. ఇది క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రాన్స్ఫర్ మైక్రో అండ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ కింద రుణ గ్రహీతకు వర్తిస్తుంది. అలాగే బ్యాంక్ గ్యారెంటీ ప్రీమియాన్ని భరిస్తుంది. సీజీటీఎంఎస్ఈ వంటి పరిశ్రమలకు ఎటువంటి థార్డ్ పార్టీ ప్రమేయం లేకుండానే లోన్ మంజూరు చేయనున్నట్లుగా తెలిపింది. అలాగే ఎంఎస్ఎంఈ కానీవారికి కనీసం 25 % తో లోన్ ఇవ్వనుంది. ఇది 2022 మార్చి 22 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

మే నెలలో రిజర్వ్ బ్యాంక్… ఇతర బ్యాంకుల కోసం రూ. 50వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇది వ్యక్తిగత, చిన్న రుణగ్రహీతలకు వారి రుణాలను తిరిగి చెల్లించడానికి మరింత సమయం ఇవ్వనుంది.

Also Read: