GST Rate: జీఎస్టీ రేటు మరింత తగ్గుతుందా..? ఆర్థిక మంత్రి ఏం చెప్పారో తెలుసా?
GST Rate: రేట్లను హేతుబద్ధీకరించడానికి మరికొంత పని చేయాల్సి ఉందని సీతారామన్ అన్నారు. తదుపరి కౌన్సిల్ సమాశంలో మరింత చర్చించాల్స ఉందని, రేటు కోతలు, హేతుబద్ధీకరణ, స్లాబ్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం వంటి కొన్ని ముఖ్యమైన అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు..

జీఎస్టీ రేట్లను మరింత తగ్గిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. పన్ను రేట్లు, శ్లాబులను హేతుబద్ధీకరించే పని దాదాపు చివరి దశకు చేరుకుందని ఆమె అన్నారు. జూలై 1, 2017న జీఎస్టీ ప్రవేశపెట్టిన సమయంలో 15.8 శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు (RNR) 2023 నాటికి 11.4 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. ఇది ఇంకా తక్కువగా ఉంటుందన్నారు.
సీతారామన్ రాష్ట్రాల సహచరులు నేతృత్వంలోని GST కౌన్సిల్ 2021 సెప్టెంబర్‌లో రేట్లను హేతుబద్ధీకరించడానికి, శ్లాబులలో మార్పులను సూచించడానికి మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేశారు. ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. జీఎస్టీ రేట్లు, శ్లాబులను హేతుబద్ధీకరించే పని దాదాపు చివరి దశకు చేరుకుందన్నారు.
రేట్లను హేతుబద్ధీకరించడానికి మరికొంత పని చేయాల్సి ఉందని సీతారామన్ అన్నారు. తదుపరి కౌన్సిల్ సమాశంలో మరింత చర్చించాల్స ఉందని, రేటు కోతలు, హేతుబద్ధీకరణ, స్లాబ్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం వంటి కొన్ని ముఖ్యమైన అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.
జీఎస్టీపై వస్తున్న విమర్శలపై ఆర్థిక మంత్రి స్పందించారు. జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత జీవితాన్ని మరింత ఖరీదైనదిగా చేసిందనే సందేహాన్ని తొలగిస్తామన్నారు. జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత ఏదైనా ఒక వస్తువుకు జిఎస్టి రేటు పెరిగిందా..? అలాంటిదేమైనా ఉంటే తెలుపాలని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




