Gold Price Today: పసిడి ధరల్లో మార్పులు.. ఒక రోజులో ఎంత పెరిగిందో తెలుసా?
Gold Price Today: ప్రతి రోజు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం ధర ఎంత పెరిగిన మహిళలో షాపులు కిటకిటలాడుతుంటాయి. అయితే తాజాగా మార్చి 8వ తేదీన దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇందులో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద కారణాలు ఉన్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇది రాబోయే కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే తాజాగా మార్చి 9వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి దేశంలో బంగారం ధరలు నిలకడగా ఉన్నప్పటికీ నిన్న ఉదయంతో పోల్చుకుంటే భారీగానే పెరిగిందనే చెప్పాలి. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక రోజులోనే తులం బంగారం ధరపై రూ.500లకుపైగా పెరిగింది. బంగారం ధరలు అనేవి రోజులో ఎప్పటికప్పుడు మారే అవకాశాలు ఉంటాయి. బంగారం ధరలు అప్పుడే పెరిగినప్పటికీ తర్వాత తగ్గవచ్చు.. లేదా పెరగవచ్చు. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడి స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,710 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,710 వద్ద ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,860 వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,710 వద్ద ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,710 వద్ద ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,710 వద్ద ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,710 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




