AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరేలా జీఎస్టీ.. సవరించిన రేట్లు ఈ నెల 5 అర్థరాత్రి నుంచి అమలు!

సెప్టెంబర్ 3న రెండు రోజుల GST కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం షెడ్యూల్ కంటే ముందుగానే జరిగింది. GST సంస్కరణకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఇందులో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, GST వ్యవస్థలో నాలుగు స్లాబ్‌లు ఉన్నాయి. కానీ కౌన్సిల్ ఈ నిర్మాణాన్ని సరళీకృతం చేయాలని పరిశీలిస్తోంది. ప్రస్తుతం 12% స్లాబ్‌లో ఉన్న దాదాపు 99% వస్తువులను 5% స్లాబ్‌కు మార్చాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరేలా జీఎస్టీ.. సవరించిన రేట్లు ఈ నెల 5 అర్థరాత్రి నుంచి అమలు!
Nirmala Sitaraman
Balaraju Goud
|

Updated on: Sep 03, 2025 | 1:02 PM

Share

సెప్టెంబర్ 3న రెండు రోజుల GST కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం షెడ్యూల్ కంటే ముందుగానే జరిగింది. GST సంస్కరణకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఇందులో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, GST వ్యవస్థలో నాలుగు స్లాబ్‌లు ఉన్నాయి. కానీ కౌన్సిల్ ఈ నిర్మాణాన్ని సరళీకృతం చేయాలని పరిశీలిస్తోంది. ప్రస్తుతం 12% స్లాబ్‌లో ఉన్న దాదాపు 99% వస్తువులను 5% స్లాబ్‌కు మార్చాలని ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో పాటు, ప్రస్తుతం 28% GST స్లాబ్‌లో చేర్చిన దాదాపు 90% వస్తువులను 18% స్లాబ్‌కు తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా చేసిన ప్రకటనను దృష్టిలో ఉంచుకుని సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. GST కౌన్సిల్ సమావేశం 12%-28% శ్లాబులను తొలగించి, ఈ వస్తువులను 5% -18% శ్లాబులలోకి తీసుకువస్తే, ఈ వస్తువుల ధరలు తగ్గవచ్చు:

12% నుండి 5% శ్లాబ్‌లోకి తగ్గుతున్న వస్తువులుః

ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు (ప్యాకేజ్డ్ స్వీట్లు, నమ్కీన్, టమోటా సాస్, పాపడ్ మొదలైనవి)

రెడీమేడ్ దుస్తులు-పాదరక్షలు

గృహోపకరణాలు (వాషింగ్ పౌడర్, బ్రష్, ఫ్యాన్ మొదలైనవి)

ఫర్నిచర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, విద్యుత్ ఉపకరణాలు

28% నుండి 18% శ్లాబ్‌లోకి తగ్గుతున్న వస్తువులుః

గృహ ఎలక్ట్రానిక్స్ (టీవీ, ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషిన్ వంటివి)

ద్విచక్ర వాహనాలు, కార్లు (మధ్య విభాగం)

సౌందర్య సాధనాలు, పరిమళ ద్రవ్యాలు

పెయింట్స్, సిమెంట్, నిర్మాణ సామగ్రి

అయితే, అందుతున్న సమాచారం ప్రకారం, GST శ్లాబ్ మార్పు తర్వాత, కొన్ని వస్తువులు చాలా ఖరీదైనవిగా మారతాయి. అంటే, ప్రభుత్వం వాటిపై పన్నును పెంచుతుంది. ఇందులో మద్యం, విలాసవంతమైన వస్తువులు వంటి హానికరమైన వస్తువులు కూడా ఉన్నాయి. సహజంగానే, దీని ప్రత్యక్ష ప్రయోజనం చౌక ధరల రూపంలో వినియోగదారులకు అందించడం జరుగుతుంది. పరిశ్రమ అమ్మకాలను పెంచుకోవడానికి కూడా అవకాశం లభిస్తుంది. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ఇది ఒక పెద్ద అడుగుగా పరిగణిస్తున్నారు. దేశీయ స్థాయిలో వినియోగాన్ని ప్రోత్సహిస్తే, తయారీ నుండి ఉపాధి వరకు దాని ప్రత్యక్ష ప్రభావాన్ని చూడవచ్చు. వాణిజ్య సుంకాల ఉద్రిక్తతల మధ్య అమెరికా కూడా తన పరిశ్రమలను కాపాడుకోవడానికి ఇటువంటి చర్యలు తీసుకోవడానికి ఇదే కారణం..!

సవరించిన జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి తీసుకువచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో నిత్యావసర వస్తువులతో పాటు ఔషధాలు, గృహపకరణాలు, మోటార్ సైకిల్స్‌, మొబైల్స్‌ కొనుగోలు చేసేవారు రెండు రోజుల పాటు వెయిట్ చేస్తే లబ్ధి చేకూరుతుందంటున్న ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..