Jio Plus Post Paid: వినియోగదారులకు గుడ్‌న్యూస్.. జియో ప్లస్ పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ సేవలు ప్రారంభం
రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. యూజర్లను మరింతగా పెంచుకునేందుకు జియో మరింతగా శ్రమిస్తోంది. తక్కువ ధరల్లో ప్లాన్ష్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన జియో.. ఇప్పుడు కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. జియో ప్లస్ పేరుతో జియో కొత్తగా ప్రవేశపెట్టిన..
రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. యూజర్లను మరింతగా పెంచుకునేందుకు జియో మరింతగా శ్రమిస్తోంది. తక్కువ ధరల్లో ప్లాన్ష్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన జియో.. ఇప్పుడు కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. జియో ప్లస్ పేరుతో జియో కొత్తగా ప్రవేశపెట్టిన పోస్ట్ పెయిడ్ ఫామిలీ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ఒక కుటుంబంలోని నలుగురికి కేవలం రూ. 696 లతో నెల మొత్తం మొబైల్ సేవలు అందుతాయి. ఒక వినియోగదారుడు గరిష్టంగా 4 కొత్త కనెక్షన్‌లకు 30 రోజుల ట్రయల్ పీరియడ్ ఆఫర్‌తో పూర్తిగా ఉచితంగా ఉత్తమ పోస్ట్‌పెయిడ్ సేవలను పొందవచ్చు. ఈ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో మొదటి వ్యక్తికి నెలకు రూ. 399 చార్జి పడుతుంది. అదనంగా తీసుకునే ప్రతీ కనెక్షన్ కు రూ. 99 మాత్రమే చార్జి అవుతుంది. అంటే మొత్తం నలుగురు కుటుంబ సభ్యులకు రూ. 696 ల కనీస మొత్తం మాత్రమే చార్జ్ అవుతుంది. అంటే, ఒక్కో సభ్యుడి నెలవారీ మొబైల్ ఖర్చు రూ. 174గా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీకి ఒకే బిల్ వస్తుంది.
అలాగే ఈ ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే, ప్లాన్ లోని కుటుంబ సభ్యులు తమ డేటాను షేర్ చేసుకోవచ్చు. డైలీ డేటా లిమిట్ ఉండదు. జియో ట్రూ 5జీ వెల్ కం ఆఫర్ ద్వారా అన్ లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. ఈ జియో ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా మీకు నచ్చిన మొబైల్ నెంబర్ ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం కంటెంట్ ను ఉచితంగా పొందవచ్చు. ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా ఉచితంగా పొందవచ్చు. నెట్ ఫ్లిక్స్, ఆమెజాన్, జియోటీవీ, జియో సినిమా యాప్స్ చూడొచ్చు. జియో ఫైబర్ యూజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, వేరే టెలీకాం సంస్థలకు చెందిన పోస్ట్ పెయిడ్ కస్టమర్లు, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. వేరే నెట్ వర్క్ నుంచి సత్వరమే జియోకు మారవచ్చు.
జియో ప్లస్ కనెక్షన్ పొందడం ఎలా?
జియో ప్లస్ కనెక్షన్ కోసం వినియోగదారులు 7000070000 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. వాట్సాప్ లో పూర్తి వివరాలు అందుతాయి. సిమ్ ఫ్రీ హోం డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపు కోసం సంబంధిత ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే జియో ప్రీ పెయిడ్ సిమ్ వాడుతున్నవారు కూడా ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు మారవచ్చు. వారు తమ ఫోన్లో ఇన్ స్టాల్ అయి ఉన్న మై జియో యాప్ లోకి వెళ్లి ‘prepaid to postpaid’ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఫ్రీ ట్రయల్ ప్లాన్ ను ఎంచుకోవాలి. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి