Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Policy Surrender: పాలసీదారులకు గుడ్‌న్యూస్.. బీమా రక్షణతోనే పాలసీ సరెండర్

అనుకోని కారణాల వల్ల పాలసీ సరెండర్ చేస్తే పాలసీదారునికి బీమా రక్షణ ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఏసీఈఎస్ఓ అనే కంపెనీ పాలసీదారులకు మేలు చేసే బీమా కవర్ పోకుండానే పాలసీ సరెండర్ చేసేలా సరికొత్త ఆప్షన్‌ను వినియోగదారులకు అందిస్తుంది.  ఏఎల్‌ఐపీ పేరుతో మీరు మీ ఎండోమెంట్ బీమా పాలసీను సరెండర్ చేసినా మీ లైఫ్ కవర్ ప్రయోజనాలను కొనసాగించే అవకాశం కల్పిస్తుంది.

Policy Surrender: పాలసీదారులకు గుడ్‌న్యూస్.. బీమా రక్షణతోనే పాలసీ సరెండర్
Insurance Policy
Follow us
Srinu

|

Updated on: Jul 11, 2024 | 4:00 PM

భారతదేశంలో జీవిత బీమా అంటే అందరికీ గుర్తు వచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ). ఎల్ఐసీ పాలసీలు సరసమైన ప్రీమియంలతో వినియోగదారుల జీవితానికి భరోసానిస్తాయి. అయితే అనుకోని కారణాల వల్ల పాలసీ సరెండర్ చేస్తే పాలసీదారునికి బీమా రక్షణ ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఏసీఈఎస్ఓ అనే కంపెనీ పాలసీదారులకు మేలు చేసే బీమా కవర్ పోకుండానే పాలసీ సరెండర్ చేసేలా సరికొత్త ఆప్షన్‌ను వినియోగదారులకు అందిస్తుంది.  ఏఎల్‌ఐపీ పేరుతో మీరు మీ ఎండోమెంట్ బీమా పాలసీను సరెండర్ చేసినా మీ లైఫ్ కవర్ ప్రయోజనాలను కొనసాగించే అవకాశం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఏఎల్ఐపీ తీసుకొచ్చిన తాజా ఆప్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఏఎల్ఐపీ భారతదేశంలోని ఎల్ఐసీ ద్వారా నిర్ణయించిన కచ్చితమైన సరెండర్ విలువను పాలసీదారులకు అందిస్తుంది. అదనంగా ఏఎల్ఐపీ నామినీల కోసం అసైన్‌మెంట్ తేదీ నుంచి మెచ్యూరిటీ తేదీ వరకు ప్రతి సంవత్సరం లైఫ్ కవరేజ్ ప్రయోజనాలను వివరిస్తుంది. తదుపరి ప్రీమియం చెల్లింపులు అవసరం లేకుండా పాలసీదారు మరణిస్తే నిరంతర బీమా రక్షణను నిర్ధారిస్తుంది. 2018లో స్థాపించిన ఏసీఈఎస్ఓ ఎల్ఐసీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఎండోమెంట్ పాలసీలలో ప్రత్యేకత కలిగి ఉంది. ముఖ్యంగా రూ. 400 మిలియన్ల విలువైన అసైన్‌మెంట్‌లను సులభతరం చేసింది. ఈ సేవ సెబీ నమోదిత ట్రస్టీషిప్ కంపెనీ ద్వారా పర్యవేక్షించే ఒక స్వతంత్ర స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ ) ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తారు.

పాలసీదారు మరణించిన సందర్భంలో ఏసీఈఎస్ఓతో సంతకం చేసిన ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, షరతుల ప్రకారం నామినీ ట్రస్ట్ నుంచి మరణ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయవచ్చు. పాలసీ యాజమాన్యం బదిలీ చేయడం వల్ల ఎల్ఐసీ నామినీకి బదులుగా ట్రస్ట్‌కు ప్రయోజనాన్ని చెల్లిస్తుంది. నామినీకి మిగిలిన మొత్తాన్ని చెల్లించే ముందు ట్రస్ట్ మరణ ప్రయోజనం నుంచి 9 శాతంతో పెట్టుబడి మొత్తాన్ని (చెల్లించిన ప్రీమియంలు) తీసివేసి మిగిలిన మొత్తాన్ని నామినీకు అందజేస్తుంది. ఏసీఈఎస్ఓ వ్యవస్థాపకుడు కేతన్ మెహతా మాట్లాడుతూ ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీలు దాని వార్షిక జారీలలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. అయితే చాలా పాలసీలు (సుమారు 50%) సరెండర్‌లు లేదా లాప్స్ కారణంగా మెచ్యూరిటీకి చేరుకోవడం లేదని, ఏఎల్ఐపీ పాలసీలను ముందుగానే సరెండర్ చేయడానికి ప్రత్యామ్నాయాన్ని అందించడం ద్వారా దీనిని పరిష్కరిస్తుందని వివరించారు. పాలసీదారులు వారి భవిష్యత్ జీవిత కవరేజీని కాపాడుతూ వారి పాలసీ విలువను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుందని పేర్కొన్నారు. ఏఎల్ఐపీ త్వరిత చెల్లింపు ప్రక్రియను కలిగి ఉందని, సాధారణంగా అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను ఖరారు చేసిన తర్వాత 48 గంటలలోపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..