AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jeep India: జీప్ కార్ల ప్రియులకు శుభవార్త.. ఏకంగా రూ.2.80 లక్షల వరకూ ఆఫర్లు

జీప్ కంపెనీ మెరిడియన్ మోడల్‌ను రూ.2.80 లక్షల వరకు ప్రయోజనాలతో అందిస్తోంది. అలాగే కంపాస్ వెర్షన్ రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ప్రయోజనాలలో గరిష్టంగా 3 సంవత్సరాల వరకు ఉచిత నిర్వహణ, 2 సంవత్సరాల పొడిగించిన వారంటీ, సెలెక్టెడ్ ఫర్ యూ ప్రోగ్రామ్‌తో సులభంగా మార్పిడి చేసుకోవచ్చు.

Jeep India: జీప్ కార్ల ప్రియులకు శుభవార్త.. ఏకంగా రూ.2.80 లక్షల వరకూ ఆఫర్లు
Jeep
Nikhil
|

Updated on: Mar 17, 2024 | 6:00 PM

Share

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో ఆఫర్ల హవా నడుస్తుంది. తాజాగా జీప్ ఇండియా తమ కస్టమర్ల కోసం అనేక కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. జీప్ కంపెనీ మెరిడియన్ మోడల్‌ను రూ.2.80 లక్షల వరకు ప్రయోజనాలతో అందిస్తోంది. అలాగే కంపాస్ వెర్షన్ రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ప్రయోజనాలలో గరిష్టంగా 3 సంవత్సరాల వరకు ఉచిత నిర్వహణ, 2 సంవత్సరాల పొడిగించిన వారంటీ, సెలెక్టెడ్ ఫర్ యూ ప్రోగ్రామ్‌తో సులభంగా మార్పిడి చేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని కార్పొరేట్లకు కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. జీప్ ఇండియా ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

జీప్ కంపాస్ 15,000 వరకు, జీప్ మెరిడియన్లో 20,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. జీప్ గ్రాండ్ చెరోక్‌పై కంపెనీ రూ. రూ.11.85 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తుంది. జీప్ వేవ్ ఎక్స్ క్లూజివ్ యాజమాన్య కార్యక్రమంలో భాగంగా వినియోగదారులకు ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే జీప్ రాంగ్లర్ కూడా అన్ని ఆఫర్లతో కలిపి ఇప్పుడు రూ.62.65 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ధరలో కొనుగోలు చేయవచ్చు. జీప్ ఇండియా శ్రేణి కంపాస్ కోసం రూ.20.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అలాగే జీప్ మెరిడియన్ రూ.33.60 లక్షల నుండి ప్రారంభమవుతుంది. రాంగ్లర్ ధర రూ.62.65 లక్షల నుంచి, గ్రాండ్ చెరోకీ ధర రూ.80.50 లక్షల నుంచి కొనుగోలు చేయవచ్చు. జీప్ కార్లు డీలర్‌షిప్ ప్రయోజనాలతో పాటు ఆన్-రోడ్ ధరల గురించి మెరుగైన ధరలో అందుబాటులో ఉన్నాయి. 

జీప్ మెరిడియన్, కంపాస్‌లను అడ్వాన్స్డ్ డ్రైవర్ ఎయిడ్స్ సిస్టమ్స్ అప్డేట్ చేసే అవకాశం ఉంది. మెరిడియన్‌కు సంబంధించిన టెస్ట్ మ్యూల్ ఇటీవల గుర్తించారు. అలాగే ఈ కార్లు ప్రత్యేక సెన్సార్లను కలిగి ఉంటాయి. స్పై షాట్లో, గ్రిల్ దిగువ భాగంలో ఏడీఏఎస్ సెన్సార్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఏడీఏస్ మినహా ఎస్‌యూవీలకు ఇతర మార్పులు లేవు. మెరిడియన్, కంపాస్ ఒకే తరహా ఇంజన్‌తో వస్తాయి. ఇది 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్, ఇది గరిష్టంగా 168 బీహెచ్‌పీ శక్తిని, 350 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్‌ పుట్‌ను విడుదల చేస్తుంది. అలాగే ఈ కార్లు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO