AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel Price: మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.15 తగ్గింపు

ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2 రూపాయల మేర ధరను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రెండు రూపాయల మేర తగ్గిస్తే లక్ష్యద్వీప్‌లో మాత్రం ఏకంగా రూ.15 వరకు తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 24న లక్షద్వీప్‌లో పర్యటించారు.

Petrol, Diesel Price: మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.15 తగ్గింపు
Petrol, Diesel
Subhash Goud
|

Updated on: Mar 17, 2024 | 2:45 PM

Share

ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2 రూపాయల మేర ధరను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రెండు రూపాయల మేర తగ్గిస్తే లక్ష్యద్వీప్‌లో మాత్రం ఏకంగా రూ.15 వరకు తగ్గింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 24న లక్షద్వీప్‌లో పర్యటించారు. అక్కడ మోడీ బీచ్ కొన్ని చిత్రాలను పంచుకున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, లక్షద్వీప్‌ను సందర్శించాలని ప్రజలను కూడా విజ్ఞప్తి చేశారు.దీని తర్వాత, ఇప్పుడు ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ శనివారం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.లక్షద్వీప్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు ఏకంగా రూ.15.3 తగ్గించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద తగ్గింపు.

ఇండియన్ ఆయిల్ ద్వీపం కోసం ఇంధనాలపై అదనపు పన్నులు విధించింది. కవరత్తి, మినికైలో మౌలిక సదుపాయాలపై ఖర్చును తిరిగి పొందేందుకు ఈ పన్నులు విధించబడ్డాయి. ఇక్కడ ఇంధనానికి డిమాండ్ చాలా తక్కువగా ఉండటం, మారుమూల దీవులకు రవాణా చేయడానికి ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఈ పన్నులు కూడా విధింపు ఉంది. గత మూడేళ్లలో లీటరుకు రూ.6.9 చొప్పున పన్ను వసూలు చేశారు.

ఇప్పుడు ఖర్చులు పూర్తిగా రికవరీ అయినందున, పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఈ పన్ను తీసివేస్తోంది. అన్ని దీవులలో ధరను సమం చేయడానికి లీటరుకు రూ.7.6 మార్జిన్ ఇప్పటికీ అందుబాటులో ఉందని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆండ్రోట్‌, కల్పేని దీవుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.15.30 తగ్గాయి. అదే సమయంలో కవరత్తి, మినికాయ్ దీవులలో ధరలు 5.2 రూపాయలు తగ్గాయి. కవరత్తి, మినీకాయ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.94 నుంచి రూ.100.75కి తగ్గింది.ఆండ్రోట్, కల్పేనిలో లీటరు ధర రూ.116.13 నుంచి రూ.100.75కి తగ్గింది. అలాగే కవరత్తి, మినీకాయ్‌లో లీటరు డీజిల్‌ ధర రూ.110.91 నుంచి రూ.95.71కి, ఆండ్రోట్‌, కల్పేనిలో లీటర్‌ రూ.111.04 నుంచి రూ.95.71కి తగ్గాయి.

ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ, లక్షద్వీప్‌లో పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపు గురించి మాట్లాడుతూ.. లక్షద్వీప్ ప్రజలను తన కుటుంబంగా భావించిన మొదటి నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లక్షద్వీప్‌లోని కవరత్తి, మినీకాయ్, ఆండ్రోట్ మరియు కల్పేని అనే నాలుగు దీవులకు IOCL పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..