FD Interest Rates: ఖాతాదారులకు ఆ బ్యాంక్ శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఆఫర్..
డిపాజిట్లపై ఎవరెన్ని ఆఫర్లు పెట్టినా వడ్డీ రేటు అనేది కీలకంగా ఉంటుంది. వడ్డీ రేటను బట్టే మనం మెచ్యూర్ అయ్యాక సొమ్ము రాబడి ఆధారపడి ఉంటుంది. దీంతో కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు కూడా వడ్డీ రేట్ల పెంపునకు దోహదం చేశాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.

భారతదేశంలో పొదుపు మంత్రం పాటించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందు నుంచే పొదుపు చేయాలనే భావనతో చాలా మంది వివిధ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. దీంతో బ్యాంకులతో పాటు వివిధ ఫైనాన్స్ సంస్థలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ ఆఫర్లను పెడుతూ ఉంటాయి. డిపాజిట్లపై ఎవరెన్ని ఆఫర్లు పెట్టినా వడ్డీ రేటు అనేది కీలకంగా ఉంటుంది. వడ్డీ రేటను బట్టే మనం మెచ్యూర్ అయ్యాక సొమ్ము రాబడి ఆధారపడి ఉంటుంది. దీంతో కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు కూడా వడ్డీ రేట్ల పెంపునకు దోహదం చేశాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. అలాగే సవరించిన వడ్డీ రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఈ వడ్డీ రేట్ల గురించి కీలక విషయాలు ఓ సారి తెలుసుకుందాం.
యాక్సిస్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్లు ప్రకటించింది. సవరణ తర్వాత బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 3.50 శాతం నుంచి 7.00 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 13 నెలల నుంచి 30 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు నాన్-సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం గరిష్ట రాబడి వస్తుంది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఈ తాజా ఎఫ్‌డీ రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
తాజా వడ్డీ రేట్లు ఇలా
యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు 7 రోజుల నుంచి 45 రోజులలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే తదుపరి 46 రోజుల నుంచి 60 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.00 వడ్డీ వస్తుంది. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ 61 రోజుల నుంచి మూడు నెలల కాలవ్యవధికి 4.50 శాతం, మూడు నెలల నుంచి ఆరు నెలల కాలవ్యవధికి 4.75 శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును అందిస్తోంది. 6 నుంచి 9 నెలల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే 9 నుంచి 12 నెలల్లో మెచ్యూర్ అయ్యేవి ఇప్పుడు 6% చొప్పున వడ్డీని పొందుతాయి. అలాగే సంవత్సరం నుంచి సంవత్సరం 4 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 6.75 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది. అయితే యాక్సిస్ బ్యాంక్ 1 సంవత్సరం 5 రోజుల నుంచి 13 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.80 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 13 నెలల నుంచి 30 నెలల వ్యవధి ఉన్న డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంక్ 7.10 శాతం వడ్డీ, 30 నెలల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీని అందిస్తుంది.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..